Friday, April 26, 2024
Friday, April 26, 2024

ఏ డి సి సి బ్యాంకు లో జిల్లా స్థాయి సాంకేతిక కమిటీ సమావేశం

విశాలాంధ్ర – అనంతపురం వైద్యం : అనంతపురం జిల్లా సహకార కేంద్ర బ్యాంకు ప్రధాన కార్యాలయంలో మంగళవారం జిల్లాస్థాయి సాంకేతిక కమిటి (వివిధ పంటలకు స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ నిర్ణయించడం) జిల్లా కలెక్టరు నాగలక్ష్మి సెల్వరాజన్ అధ్యక్షతన జరిగినది. ఈ సందర్భంగా వారు బ్యాంకర్లను ఉద్దేశించి. మాట్లాడుతు జిల్లా రైతాంగానికి విరివిగా 200ఎం సోకర్యం కనిపించాలని అలాగే కౌలు రైతులకు ఋణ సౌకర్యం కల్పించాలని ఆదేశాల జారి చేసారు. ఎ.పి.సిసి బ్యాంక్ చైర్ పర్సన్ లిఖిత మాట్లాడుతూ… రాష్ట్ర ప్రభుత్వము రైతులకు ఎన్నో విధాలైన రాయితీలు కల్పిస్తున్నదని అలాగే ఆర్ .బి .కె ల ద్వారా సాంకేతిక పరిజ్ఞానాన్ని అందచేస్తుందని తెలియ చేశారు.డి డి ఏం నాబార్డు కె. అనురాధ మాట్లాడుతూ… తమల పాకు పంటలకు విరివిగా రుణాల సౌకర్యం కల్పించాలని కోరారు. డి ఎల్ టి సి కన్వీనరు, ఎ.డి .సి బ్యాంక్ సి. ఇఒ ఎబి రాంప్రసాద్ వివిధశాఖల నుంచి ఏ పంటకు ఎకరాకు ఎంత ఇవ్వవచ్చు. అను ప్రతి పాదనలను కమిటి వారి ముందు ఉంచారు. బ్యాంకర్లు, వివిధశాఖల వారు కులంకుశంగా చర్చించి జిల్లా కలెక్టరు నాగలక్ష్మి సెల్వరాజిన్ ఆధ్వర్యంలో ఏకగ్రీవంగా ఆమోదం తెలిపి తదుపరి చర్యలుగా రాష్ట్రస్థాయి కమిటివారికి హక్కులను పంపడం జరిగినది. ఈ సమావేశంలో రెండు జిల్లాల ఎల్ డి ఏం లు , జె .డి అగ్రికల్చర్ , వాణిజ్య బ్యాంకుల ప్రతినిధులు, అభ్యదయ రైతులు,ఎ.డి.సి సి బ్యాంక్ జనరల్ మేనేజరు కె. సురేఖరాణీ, బ్యాంక్ సీనియర్ అధికారులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img