Saturday, April 27, 2024
Saturday, April 27, 2024

ఐ ఆర్ సి ఎస్ ఆధ్వర్యంలో చిన్నారులకు కంటి అద్దాల పంపిణీ

విశాలాంధ్ర -అనంతపురం వైద్యం : ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ శ్రీ సత్యసాయి జిల్లా శాఖ ఎల్ వి ప్రసాద్ ఐ ఇన్స్టిట్యూట్ సంయుక్తంగా కదిరి మొటుకుపల్లి ఆర్ డి టి ఇంక్లూజివ్ ఎడ్యుకేషన్ లో మెదడు పక్షవాత చిన్నారులకు,బుద్దిమాంద్యలకు,శారీరక వికలాంగులకు, బుదిరులకు మార్చి నెలలో కంటి పరీక్షలు నిర్వహించడం జరిగింది. మొత్తం 68 కి కంటి పరిక్షలు నిర్వహించడం జరిగింది. మంగళవారం 06 మంది పిల్లలకు కంటి అద్దాలు ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎల్ వి ప్రసాద్ ఐ ఇన్స్టిట్యూట్ కోఆర్డినేటర్ ఎం డి రఫిక్ మాట్లాడుతూ… కంటి అద్దాలు ఉపయోగించడం వలన
బాగా చదవడం, రాసుకోవడం జరుగుతుందని, ఇబ్బందికర పరిస్థితి నుండి మెరుగైన పరిస్థితికి రావొచ్చని అదేవిధంగా సూర్య కిరణాల నుండి రక్షణ పొందవచ్చు అని చికాగు నుండి దూరం కావొచ్చని వ్యక్తి అభివృద్ధి కి అద్దాల ప్రాముఖ్యత చాలా ఉందని వీటిని చాలా జాగ్రత్తగా ఉపయోగించుకోవాలనే విద్యార్థులకు తెలియజేశారు. రెడ్ క్రాస్ కోఆర్డినేటర్ బి .రమేష్, సెంటర్ ఇంచార్జి సిస్టర్ నక్షత్రమ్మ ,హెచ్ ఎం నాగఫణి ఆర్ డి టి సిబ్బంది,విద్యార్థులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img