Friday, April 26, 2024
Friday, April 26, 2024

కళాతపస్వి కె.విశ్వనాథ్ మృతి తీరనిలోటు :

  • రచయిత్రి నల్లాని రాజేశ్వరి తీవ్ర సంతాపం
    విశాలాంధ్ర- అనంతపురం వైద్యం
    : తెలుగు సినిమా ఆత్మగౌరవాన్ని జాతీయ స్థాయిలో రెపరెప లాడించిన దర్శకుడు, కళాతపస్వి కె. విశ్వనాథ్ అని ప్రముఖ రచయిత్రి, సామాజిక కార్యకర్త నల్లాని రాజేశ్వరి అన్నారు. దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు గ్రహీత, పద్మశ్రీ కె.విశ్వనాథ్ కన్నుమూయడం తీరని లోటన్నారు.పలు సందర్భాల్లో ఆయనను కలిసే అవకాశం రావడం తన అదృష్టమన్నారు. తెలుగు చిత్రపరిశ్రమకు గొప్ప గౌరవాన్ని, గుర్తింపును తీసుకొచ్చిన విశ్వనాథ్ 50కి పైగా సినిమాలకు దర్శకత్వం వహించారని చెప్పారు. భారతీయ సంస్కృతికి చిహ్నమైన శాస్త్రీయ కళలను కథలుగా ఎన్నో అద్భుతమైన సినిమాలు చేశారని రాజేశ్వరి వివరించారు. అక్కినేని నాగేశ్వరరావు నటించిన ఆత్మ గౌరవం సినిమాతో దర్శకుడిగా మారారని, శంకరాభరణం సినిమా తెలుగు చిత్రసీమలో చరిత్ర సృష్టించేలా జాతీయ పురస్కారం గెలుచుకుందన్నారు. సాగరసంగమం, శృతిలయలు, సిరివెన్నెల, స్వర్ణకమలం, స్వాతికిరణం ఆయకు కీర్తి ప్రతిష్ఠతలు తెచ్చిపెట్టాయన్నారు. సామాజిక సమస్యలను ప్రస్తావిస్తూ.. ఆయన తీసిన సప్తపది, స్వాతిముత్యం, స్వయంకృషి, శుభోదయం, శుభలేఖ, ఆపద్బాంధవుడు, శుభసంకల్పం అందరినీ ఆలోజింపజేశాయన్నారు. సిరిసిరి మువ్వ సినిమాతో దర్శకుడిగా ఆయన ప్రతిభ వెలుగులోకి వచ్చిందన్నారు. ఎన్నో అద్భుతమైన.. అపురూపమమైన చిత్రాలను టాలీవుడ్‌కి అందించారని కొనియాడారు. దర్శకుడిగానే గాక.. నటుడిగానూ తెలుగు సినీ అభిమానులను అలరించారని, అనేక సినిమాల్లో తన అద్భుతమైన నటనతో ఆకట్టుకున్నారని గుర్తుచేశారు. శుభసంకల్పం, నరసింహనాయుడు, కలిసుందాం రా, ఆడవారి మాటలకు అర్ధాలే వేరులే, ఠాగూర్, అతడు, ఆంధ్రుడు, మిస్టర్ పర్‌ఫెక్ట్ వంటి హిట్ సినిమాల్లో విశ్వనాథ్ నటించారని వివరించారు. తెలుగులో చివరగా హైపర్ సినిమాలో కనిపించారని, సినిమారంగంలో చేసిన కృషికి గాను… 2016 లో ఆయన దాదాసాహెబ్ ఫాల్కే పురస్కారం వరించిందని చెప్పారు. 1992 లో రఘుపతి వెంకయ్య పురస్కారంతో పాటు పద్మశ్రీ అవార్డును ఆయన అందుకున్నారన్నారు. కే. విశ్వనాథ్ పేరు చెబితే ఒక ాశంకరాభరణం్ణ, ాసాగర సంగమం్ణ, ాస్వాతిముత్యం్ణ, ాసిరిసిరిమువ్వ్ణ సినిమాలు గుర్తుకువస్తాయన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img