Saturday, April 27, 2024
Saturday, April 27, 2024

కార్పొరేట్ ప్రైవేట్ విద్యా సంస్థల్లో విద్యార్థుల ఆత్మహత్యలను నివారించాలి

ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు జాన్సన్ బాబు

విశాలాంధ్ర-గుంతకల్లు : కార్పొరేట్ ప్రైవేట్ విద్యా సంస్థల్లో విద్యార్థుల ఆత్మహత్యలను నివారించాలని ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు జాన్సన్ బాబు అన్నారు.గురువారం పట్టణంలో బీటీ పకీరప్ప భవనం సీపీఐ కార్యలయంలో సమావేశాం నిర్వహించారు.ఈ సమావేశంలో ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు జాన్సన్ బాబు మాట్లాడుతూ…రాష్ట్రంలో ఉన్న చైతన్య నారాయణ విద్యాసంస్థల్లో ప్రభుత్వ నిబంధనలు పాటించకుండా అపార్ట్మెంట్లో కళాశాల నడుపుతూ విద్యార్థులకు సరైన వాతావరణం లేని ఎడల కాలుష్యము విపరీతమైన చదువు ఒత్తిడి గురి చేస్తూ ఇంటర్ బోర్డు నిబంధన ప్రకారం కళాశాల నడపకుండా ఇష్టము వచ్చినట్టు వారి వారి వ్యాపారం ధనార్జన ధ్యేయంగా పుస్తకాలు దుస్తులు ముద్రించుకొని ఐఐటి త్రిబుల్ ఐటీ ఒలంపియాడ్ టెక్నో ఏఐటీ జెడ్ ఎఫ్ టి బి నీట్ ఐపీఎల్ ఎంపిఎల్ పేరుతో వేలకు వేల రూపాయలు ఫీజులు పేరుతో విద్యార్థుల తల్లిదండ్రులను వేధిస్తున్నారన్నారు. విద్యార్థులను కూడా క్లాస్ రూమ్ లో విద్యార్థుల ముందు నిలబెట్టి విద్యార్థులను అవమానిస్తూ ఫీజులు కట్టమని బెదిరిస్తున్నారని తద్వారా విద్యార్థులు వాళ్ళ తల్లిదండ్రులు ఒత్తిడి గురైన విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారన్నారు. ఈ ఆత్మహత్యలు కారణం ముమ్మాటికి రాష్ట్ర ప్రభుత్వం అన్నారు.రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్న అధిక విద్యాధికారులు ప్రభుత్వ నిబంధనలను ఉల్లంఘించి జీవోలను తొక్కి ఇష్టం వచ్చినట్టు వసూళ్లకు పాల్పడుతున్నారన్నారు. వీటిని చూసిచూడనట్టు వివరిస్తూ ఉన్నా అధికారులు గతంలో జగన్మోహన్ రెడ్డి పాదయాత్రలో చెప్పడం జరిగిందన్నారు.చైతన్య ,నారాయణ విద్యాసంస్థల్లో ప్రాణాలు కోల్పోతున్న వారి తల్లిదండ్రులకు న్యాయం చేస్తానని వారి పైన చర్య తీసుకుంటానని చెప్పి అధికారంలోకి వచ్చిన తర్వాత వారు యెదేచ్ఛగా అధిక ఫీజులు జీవో నెంబర్లు పక్కదారి పట్టిస్తూ కళాశాలలో పాఠశాలలో నిర్వహిస్తున్న పట్టించుకోవడం లేదు విద్యార్థుల ఆత్మహత్యలు ఆపాలి అంటే ప్రభుత్వాధికారులు కట్టుదిట్టమైన విధులు నిర్వహించి వారిపైన చర్యలు తీసుకొని విద్యార్థుల ప్రాణాలను కాపాడాలన్నారు. రాష్ట్రంలో ఇప్పటికే పలు కళాశాలలో విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఇంకా ఈ నిబంధనలను కట్టుదిట్టం చేయకపోతే మరిన్ని ప్రాణాలు పోయే అవకాశం ఉంది కావున తక్షణమే నారాయణ చైతన్య విద్యాసంస్థలు పైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.ఈ సమావేశంలో నియోజకవర్గ అధ్యక్ష కార్యదర్శులు వేణు గోపాల్, వెంకట్ నాయక్,ఆర్గనైజింగ్ కార్యదర్శి వినోద్ ,అనంతపురం జిల్లా కౌన్సిల్ మెంబర్ శాంతరాజు, గుంతకల్ నాయకులు రాజకుమార్, శివ,మనీ తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img