Friday, April 26, 2024
Friday, April 26, 2024

ఘనంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు

విశాలాంధ్ర-ధర్మవరం : మండల పరిధిలోని మోటుమర్ల గ్రామంలో గల కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయంలో గురువారం అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలను డిప్యూటీ డి ఎం హెచ్ ఓ.. థామస్ సెల్వి సల్మాన్ ఆధ్వర్యంలో ఘనంగా విద్యార్థినీల నడుమ నిర్వహించుకున్నారు. ఈ సందర్భంగా సెల్వి సల్మాన్ మాట్లాడుతూ చూపకూడదని మహిళలు నేడు అన్ని రంగాలలో రాణిస్తుండడం ఎంతో శుభదాయకమని తెలిపారు. కావున తల్లిదండ్రులు బాలికల పట్ల వివక్షత ఉండకూడదని, చక్కటి విద్యాబాషాలు నేర్చుకోవడం ద్వారానే, తెలివితేటలతో భవిష్యత్తును బంగారు భవిష్యత్తుగా మార్చుకుంటారని తెలిపారు. ఈ కార్యక్రమంలో కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ కళావతి, ప్రిన్సిపాల్ చంద్రకళ ,ఆప్తా మాలిక్ ఆఫీసర్ ఉరుకుందప్ప, హెల్త్ సూపర్వైజర్స్ కామేశ్వరి, వెంకట రాముడు, ఆరోగ్య కార్యకర్త శివమ్మ ,ఎంఎల్ హెచ్పి అనిత, హెల్త్ అసిస్టెంట్ చౌడయ్య, పాఠశాల ఉపాధ్యాయ బృందం, ఆరోగ్య కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img