Friday, April 26, 2024
Friday, April 26, 2024

జాతీయ పొగాకు నివారణపై అవగాహన ర్యాలీ

విశాలాంధ్ర`అనంతపురం వైద్యం : జాతీయ పొగాకునియంత్రణ కార్యక్రమంలో భాగంగా రాష్ట్ర కమిషనర్‌ ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ శాఖ వారి ఆదేశాల మేరకు జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి కార్యాలయంలో గురువారం ఇన్‌ఛార్జ్‌ డిఎంఅండ్‌హెచ్‌ఓ డాక్టరు వై. యుగంధర్‌, ఇన్‌ఛార్జ్‌ డీఎం అండ్‌ హెచ్‌ ర్యాలీని ప్రారంభించారు. రాష్ట్ర పొగాకు నియంత్రణ లీగల్‌ అడ్వైజర్‌ పి. శివ శంకర మాట్లాడుతూ, జాతీయ పొగాకు నియంత్రణ చట్టం సి ఒ టి పి ఏ -2003 అమలు మరియు పర్యవేక్షణ పై వివిధ శాఖల నుంచి వచ్చిన అధికారులకు అవగాహణ కల్పించారు.అలాగే జిల్లా పోలీస్‌ సూపరింటెండెంట్‌ వారి సహకారంతో గత యేడాది కాలంలో జిల్లాలో 6 లక్షల55 వేల రూపాయలు జరిమానా విధించడం జరిగిందని జిల్లా పోలీసు శాఖ వారికి కృతజ్ఞతలు తెలిపారు.ముఖంగా బహిరంగ ప్రదేశాల్లో, నిషేధిత ప్రభుత్వ మరియు ప్రైవేట్‌ విద్యా సంస్థల ఆవరణంలో లో ధూమపానం చేయడం పొగాకు ఉత్పత్తుల అమ్మకం వంటి వాటికి జరిమానా విధించడమైనది.జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి మాట్లాడుతూ, పొగాకు మరియు వాటి ఉత్పత్తులను సేవించడం వలన కలిగే దుష్ప్రభావాలను వివరిస్తూ ఈ చటాన్ని పకడ్బందీగా అమలు చేయాలని తెలియజేసారు.జిల్లా జాతీయ పొగాకు నియంత్రణ కార్యక్రమఅధికారి డాక్టర్‌ జి. నారాయణ స్వామి మాట్లాడుతూ, మండల, పట్టణ స్థాయి ఎన్ఫోరసెమెంట్‌ టీమ్‌ ద్వార అవగాహన కల్పించాలని ,అతిక్రమించిన వారికి సి ఒ టి పి ఏ -2003 యాక్ట్‌ అమలు చేయాలని తెలియజేసారు. తర్వాత పట్టణంలో ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి మరియు మునిసిపల్‌ గెస్ట్‌ హౌజ్‌ ముందు అనధికార పొగాకు విక్రయ దారులకు ఎన్ఫోర్స్మెంట్‌ డ్రైవ్‌ ద్వారా అవగాహన కల్పించి మరియు చాలనా రూపంలో నుంచి జరిమాన విధించారు.ఈ కార్యక్రమంలో పోలీసు శాఖ,వేణు గోపాల్‌ రెడ్డి, నవీన్‌ కుమార్‌, అల్లబకాష్‌, యూజలా, వళి,బాసూ, వివిధ శాఖల అధికారులు డ్రగ్‌ కంట్రోల్‌, విద్యా శాఖ,ఐసీడీస్‌,పంచాయతీ రాజ్‌, అసిస్టెంట్‌ లేబర్‌, అగ్రికల్చర్‌, సేల్‌ టాక్స్‌, మునిసిపల్‌ కార్పొరేషన్‌ . నాగేంద్ర,జిల్లా కోఆర్డినేటర్‌ కలెక్టర్‌ కార్యాలయం, మరియు జిల్లా వైద్య శాఖ ప్రోగ్రామ్‌ ఆఫీసర్లు డాక్టర్‌ సుజాత, చెన్నకేశవులు మరియు జిల్లా పొగాకు నియంత్రణ సామాజిక కార్యకర్త బి. శ్రీరాములు, యన్‌. సి .డి సిబ్బంది ఆంజనేయులు, మౌనిక, శశికళ పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img