Friday, April 26, 2024
Friday, April 26, 2024

జాతీయ యువజన ఉత్సవాలకు ఆహ్వానం… ప్రిన్సిపాల్ రిజ్వాన్ భాష

విశాలాంధ్ర -ధర్మవరం: ఈనెల 12వ తేదీ నుండి 16వ తేదీ వరకు కర్ణాటకలోని ధార్వాడ నందు జరగబోవు జాతీయ యువజన ఉత్సవాలకు గాను పట్టణములోని వివేకానంద డిగ్రీ కళాశాల విద్యార్థిని కావ్యాకు ఆహ్వానం అందిందని ప్రిన్సిపాల్ రిజ్వాన్ భాషా పేర్కొన్నారు. ఈ సందర్భంగా గురువారం వారు మాట్లాడుతూ కావ్య మా కళాశాలలో బీఎస్సీ కంప్యూటర్స్ రెండవ సంవత్సరం చదువుతోందని, కావ్య గత నెలలో విజయవాడ నందు జరిగిన రాష్ట్రస్థాయి యువజన ఉత్సవాలలో భాగంగా వక్తృత్వ పోటీల నందు రెండవ స్థానంలో ఎంపిక కావడం పట్ల సంతోషాన్ని వ్యక్తం చేయడం జరిగిందని,తిరిగి జాతీయ యువజన ఉత్సవాల్లో పాల్గొనుటకు మా కళాశాల విద్యార్థికి ఆహ్వానం రావడం అత్యంత ఆనందదాయకంగా ఉందని తెలిపారు. భారతదేశ ప్రధాని నరేంద్ర మోడీతో తాను మాట్లాడే అవకాశం పొందడం చాలా గొప్ప విషయమని, అందుకే కావ్య కు అభినందనలు తెలియజేయడం జరిగిందన్నారు. భవిష్యత్తులో కూడా మరిన్ని విజయాలను సాధించాలని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏవో కరీముల్లా, అధ్యాపకులు, బోధన్యతర సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.
రిజ్వాన్ భాష కు సన్మానం::-ఇటీవలే వివేకానంద డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ రిజ్వాన్ భాషా జాతీయ అవార్డు అందుకున్న సందర్భంగా, విద్యా వ్యవస్థలో అందించిన విశిష్ట సేవలకు గుర్తింపుగా రిజ్వాన్ భాషను పెనుకొండ దర్గా 750వ ఉరుసు ఉత్సవాల సందర్భంగా దర్గా పీఠాధిపతి తాజ్ బాబాఁపెనుకొండ దర్గా జాతీయ విశిష్ట సేవా అవార్డునుఁపంపిణీ చేస్తూ ఘనంగా సత్కరించారు. అనంతరం రిజ్వాన్ భాషా మాట్లాడుతూ పేద విద్యార్థులను విద్యలో ఆణిముత్యములా తయారు చేయడమే, నా లక్ష్యం అని వారు తెలిపారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img