Friday, April 26, 2024
Friday, April 26, 2024

దోమ కాటు వల్ల వచ్చే వ్యాధులతో అప్రమత్తంగా ఉండాలి

విశాలాంధ్ర-రాప్తాడు : దోమ కాటు వల్ల వచ్చే ఫైలేరియా వ్యాధితోపాటు ఇతర రోగాలు దరిచేరకుండా అప్రమత్తంగా ఉండాలని జిల్లా మలేరియా అధికారి డి. ఓబులు అన్నారు. గురువారం ఎం.బండమీదపల్లి గ్రామంలో పాజిటివ్ కేసును పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఫైలేరియా వ్యాధి క్యూలెక్స్ దోమ కాటు వల్ల వస్తుందని, ఇది ఎక్కువగా మురికి కాలువలలో నివసిస్తాయని, కావున కాలువలను ఎప్పటికప్పుడు శుభ్రపరిచి నీరు పారేలా చర్యలు తీసుకోవాలన్నారు. అదేవిధంగా మన ఇంటిలో దోమలు రాకుండా కిటికీలకు, వాకీళ్లకు మెష్ లను, దోమ తెరలు ఉపయోగించాలన్నారు. సాయంత్రం వేపాకు పొగ వేసుకోవడం మంచిదన్నారు. ఈ వ్యాధి వలన మానవుని మరణానికి దారి తీయకపోయినప్పటికీ దీనివల్ల కలిగే దుష్పరిణామాలు చాలా తీవ్రమైనన్నారు. ఈ వ్యాధి నుంచి పూర్తి విముక్తికి మార్గం లేదని.. రాకుండా చూసుకోవడం ఉత్తమ మార్గమన్నారు. ఈ వ్యాధి సోకిన వారికి వ్యాధి నిరోధక శక్తి లోపించి ఇతర వ్యాధుల గురి కావడానికి అవకాశం ఎక్కువగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో
ఏఎంఓ కె. సత్యనారాయణ, సబ్ యూనిట్ అధికారి మద్దయ్య, మలేరియా సబ్ యూనిట్ సూపర్వైజర్ సయ్యద్ నూర్ బాషా, ఏఎన్ఎం నాగేశ్వరమ్మ, ఎంఎల్హెచ్పీ సత్యమయ్య, ఆశా కార్యకర్తలు లక్ష్మీదేవి, వెంకటలక్ష్మి, ముత్యాలమ్మ తదితరులు ఉన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img