Friday, April 26, 2024
Friday, April 26, 2024

భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ కార్యక్రమాలు కొనసాగించండి

విశాలాంధ్ర- పెనుకొండ : పెనుకొండ భవన నిర్మాణ కార్మిక సంఘం బుధవారం తాసిల్దార్ సువర్ణకు సిపిఐ డివిజన్ కార్యదర్శి శ్రీరాములు నేతృత్వంలో వినతి పత్రం సమర్పించడం జరిగింది, మన రాష్ట్ర ప్రభుత్వం భవన నిర్మాణ కార్మికులను నట్టేట ముంచిందని భవనిర్మాణ కార్మికుల వీధిన పడవేసినది భవన నిర్మాణ కార్మికులు 47 రకముల పనిచేయువారు భవన నిర్మాణ కార్మికుల కిందికి వర్తిస్తారని వీరికి శిస్తు రూపంలో వచ్చినటువంటి డబ్బులతో ప్రభుత్వం కొన్ని సంక్షేమ పథకాలు గతంలో పెట్టిందని మరియు ఇప్పుడు వచ్చినటువంటి వైఎస్ఆర్ ప్రభుత్వం సంక్షేమ పథకాలన్నీ కూడా తుంగలోకి తొక్కి శిస్తురూపంలో వచ్చినటువంటి భవన నిర్మాణ కార్మికుల డబ్బులను సంక్షేమ పథకాలకు ఎగనాము పెట్టి ఆ డబ్బులు అన్ని కూడా ప్రభుత్వ ఖాతాలోకి వేసుకొని సంక్షేమ పథకాలు నిర్వీర్యం చేసిందని మన రాష్ట్రంలో 40 లక్షల మంది భవన నిర్మాణ కార్మికులు ఉన్నారని అందులో 20 లక్షల మంది మాత్రమే భావన నిర్మాణ కార్మికులుగా లేబర్ ఆక్ట్ ప్రకారం లేబర్ ఆఫీస్ లో గుర్తింపు పొందిన వారు ఉన్నారని అయితే భవన నిర్మాణ కార్మికులు పనులు లేక అల్లాడిపోతూ వలసలు పోయే పరిస్థితి ఉందని ప్రభుత్వం ఇసుకను నిర్బంధము చేసి ఇసుక ఇతర రాష్ట్రాలకు దొంగగా తరలిపోతున్న చోద్యం చూస్తున్నారని భవన నిర్మాణ కార్మికులకు పరిస్థితి ఏర్పడిందని అందుకే ప్రభుత్వం ఉచిత ఇసుకను సప్లై ఇవ్వాలని మరి అదేవిధంగా గత ప్రభుత్వంలో ఉన్నటువంటి ప్రభుత్వ సంక్షేమ పథకాలన్నీ కూడా వచ్చే విధంగా భవన నిర్మాణ కార్మికులు ప్రభుత్వ సంక్షేమ పథకాలు వెంటనే అందివ్వాలని డిమాండ్ చేస్తున్నాము. ఈ కార్యక్రమంలో భవన నిర్మాణ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు శ్రీరాములు, మండల కార్యదర్శి మల్లికార్జున, సిపిఐ పట్టణ కార్యదర్శి వెంకటేషులు, వెంకట్రాముడు, తదితరులు పాల్గొనడం జరిగింది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img