Friday, April 26, 2024
Friday, April 26, 2024

నాణ్యమైన విత్తన కాయలు 90% సబ్సిడీతో అందించాలి : సిపిఐ

విశాలాంధ్ర- తనకల్లు : ప్రస్తుత ఖరీఫ్ సీజన్లో పంపిణీ చేసే వేరుశనగ విత్తన కాయలను పరిశీలించిన సిపిఐ బృందం 90% సబ్సిడీతో విత్తన కాయలను అందించాలని స్పందన కార్యక్రమంలో తాసిల్దార్ మధు నాయక్ కు వినతిపత్రం అందజేశారు గత సంవత్సరాలుగా రైతు అతివృష్టి అనావృష్టి కారణంగా పూర్తిగా నష్టపోయి సమస్యల వలయంలో చిక్కుకున్నారని అటువంటి రైతులకు ఉపశమనం కలిగే విధంగా 90 శాతం సబ్సిడీతో విత్తన కాయలు అందించడమే కాక వ్యవసాయానికి అవసరమైన నవధాన్యాలను ఎరువులను రైతు భరోసా కేంద్రాల ద్వారా ఉచితంగా అందివాలన్నారు ఈ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుండి రైతులకు ఎటువంటి ఇన్పుట్ సబ్సిడీ కానీ ఇన్సూరెన్స్ కానీ అందలేదన్నారు రైతు ప్రభుత్వం అని గొప్పలు చెప్పుకోవడం తప్ప రైతులకు భరోసా ఇచ్చే ప్రభుత్వం ఏదో కనపడటం లేదన్నారు రైతులను ఆదుకోవడంలో ప్రభుత్వం విఫలమైందని రైతులు పండించే పంటలకు గిట్టుబాటు ధర కల్పించలేదన్నారు స్వామినాథన్ కమిటీ సిఫార్సులు మేరకు భూమి లేని రైతులకు ఐదు ఎకరాల భూమి ఇవ్వాలని ప్రభుత్వ భూ పంపిణీ కార్యక్రమాన్ని నిర్లక్ష్యం చేయకుండా వెంటనే అసైన్మెంట్ కమిటీ ద్వారా అర్హులైన రైతులకు భూ పట్టాలు అందజేయాలన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఐ నియోజకవర్గ కార్యదర్శి కదిరప్ప మండల కార్యదర్శి రెడ్డప్ప నాయకులు రవి శ్రీనివాసులు వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img