Saturday, April 27, 2024
Saturday, April 27, 2024

నియోజక వర్గంలోని  సమస్యలను  లోకేష్ దృష్టికి తీసుకెళ్లిన సీపీఐ ఏఐఎస్ఎఫ్ నాయకులు

విశాలాంధ్ర-కదిరి : కదిరి నియోజకవర్గ పరిధిలోని సమస్యలను టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ దృష్టికి  సీపీఐ డివిజన్ కార్యదర్శి కదిరప్ప,సహాయ కార్యదర్శి,రాజేష్,  ఏఐఎస్ఎఫ్ జిల్లా సహాయ కార్యదర్శి ఉపేంద్రలుఆయన దృష్టికి తీసుక వెళ్లారు. ఎన్పీకుంట మండలంలో సోలార్ హాబ్ కోసం ఎన్నో సంవత్సరాల నుండి సాగు చేసుకుంటున్న  భూములను సోలార్ అభివృద్ధి కోసం ఇస్తే బాధిత రైతులకు  ఇంతవరకు  నష్ట పరిహారం అందలేదని తెలిపారు.వంక మద్ది, పెడబల్లి గొల్ల పల్లి,గ్రామీణ ప్రాంతాలకు రోడ్డు వేస్తామని కంకర వేసి వదిలేయడతో పాదాచారులు ద్విచక్ర వాహన దారులు రోడ్డు ప్రమాదాలకు గురవుతున్నారని పేర్కొన్నారు. నియోజక వర్గంలోని అన్ని మండలాలకు హంద్రీనీవా ద్వారా ప్రతి ఎకరాకు నీరు అందించి ఈ ప్రాంత రైతులను ఆదుకోవాలని, కదిరి ప్రాంతంలొ పరిశ్రమలు ఏర్పాటు చేసి నిరుద్యోగులకు ఉపాధి కల్పించి ఆదుకోవాలని కోరారు.ఏఐఎస్ఎఫ్ నాయకుడు ఉపేంద్ర మాట్లాడుతు కదిరి నియోజకవర్గంలో అన్ని మండల కేంద్రాల్లో బాల బాలికలకు  కళాశాల వసతిగృహాలు ఏర్పాటు చేశారని, ఇప్పటికి అన్ని వసతి గృహాలు అద్దె భవనాలల్లో కొనసాగుతున్నాయని ఇప్పటివరకు పక్కా భవనాలు లేక విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు గురవుతున్నారన్నారు.ఈ కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ నాయకులు జనార్దన్, వెంటేష్ తదితర నాయకులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img