Friday, April 26, 2024
Friday, April 26, 2024

పంచాయతీల అభివృద్దికి సమగ్ర ప్రణాళికలు

విశాలాంధ్ర-రాప్తాడు : గ్రామాల అభివృద్దే దేశాభివృద్ధికి పట్టుకొమ్మలని మహాత్మాగాంధీ కలలుగన్న గ్రామస్వరాజ్యానికి అనుగుణంగా పంచాయతీల అభివృద్ధికి సమగ్ర ప్రణాళికలు రూపొందించాలని ఎంపీపీ చిట్రెడ్డి జయలక్ష్మి సూచించారు. రాప్తాడు ఎంపీడీఓ కార్యాలయంలో 2023-24 కి సంబంధించి పంచాయతీ అభివృద్ధి ప్రణాళికపై గురువారం గాండ్లపర్తి, బోగినేపల్లి, పాలచెర్ల, జి.కొత్తపల్లి, మరూరు, ఎం.చెర్లోపల్లి సర్పంచులు, ఎంపీటీసీ సభ్యులకు, సచివాలయ సిబ్బందికి, మండల అధికారులకు శిక్షణ తరగతులు నిర్వహించారు. ఎంపీపీ చిట్రెడ్డి జయలక్ష్మి మాట్లాడుతూ, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వివిధ పథకాలకు సంబంధించిన లబ్ధిదారుల గుర్తింపు, వచ్చే కాలానికి చేపట్టే పనులు, బడ్జెట్‌లో ఆమోదించాల్సిన అంశాలను సూచించడం, పన్నుల మార్పుల ప్రతి పాదనలు, పన్ను బకాయిదారులను, కొత్త కార్యక్రమాల లబ్ధిదారుల ఎంపిక జాబితా రూపొందించాలన్నారు. కార్యక్రమంలో ఎంపీడీఓ సాల్మన్‌, అడ్మినిస్ట్రేటివ్‌ ఆఫీసర్‌ రత్నాబాయి, ట్రైనింగ్‌ ఆఫ్‌ ట్రైనర్‌ అరుణ్‌ కుమార్‌, యోగా టీచర్లు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img