Friday, April 26, 2024
Friday, April 26, 2024

పంజాబ్ నేషనల్ బ్యాంక్ సేవలను వినియోగదారులు సద్వినియోగం చేసుకోవాలి..

ధర్మవరంలో పంజాబ్ నేషనల్ బ్యాంక్ నూతన శాఖ ప్రారంభం

జిల్లా కలెక్టర్ పి.బసంత్ కుమార్
విశాలాంధ్ర -ధర్మవరం : పంజాబ్ నేషనల్ బ్యాంక్ సేవలను వినియోగదారులు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ పి.బసంత్ కుమార్ పేర్కొన్నారు. శుక్రవారం ధర్మవరం పట్టణంలోని కెపిటి స్ట్రీట్ లో ఉన్న పాత చక్రవర్తి థియేటర్ దగ్గర పంజాబ్ నేషనల్ బ్యాంక్ నూతన శాఖను జిల్లా కలెక్టర్ ప్రారంభించారు. బ్రాంచ్ ఏటిఎంను పట్టణ ప్రముఖులు దాసెట్టి నాగరాజు ప్రారంభించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ బ్యాంకింగ్ రంగంలో చాలా మార్పులు, సంస్కరణలు వస్తున్నాయన్నారు. ప్రస్తుతం కస్టమర్ సర్వీసులు ఇంటి వద్దకే ఇస్తున్నారన్నారు. పురాతన కాలం నాటి ఇలాంటి బ్యాంకులను ప్రోత్సహించడం ద్వారా ఆర్థిక భద్రత ఉంటుందని, పాతకాలం నాటి బ్యాంకుల్లో వినియోగదారులకు విలువ కూడా ఉంటుందన్నారు. పంజాబ్ నేషనల్ బ్యాంక్ లో వినియోగదారులకు ప్రాధాన్యత అధికంగా ఉంటుందని తెలిపారు. ఈ బ్యాంకులో వినియోగదారులకు అవసరమైన అన్ని రకాల సేవలు అందిస్తున్నారన్నారు. జాతీయస్థాయి బ్యాంకుల్లో హెల్త్ ఇన్సూరెన్స్ చేసుకోవడం వల్ల సమయానికి ఆర్థిక సహాయం వస్తుందని, ఎలాంటి ముందస్తు డబ్బు చెల్లించకుండా చికిత్స అందించడం జరుగుతుందన్నారు. బ్యాంకులు అనేవి డబ్బులు వేసి తీసుకునేందుకే కాకుండా మన జీవితంలో అన్ని రకాల అంశాలతో పెనవేసుకుపోయాయన్నారు. ఆర్థికపరమైన అన్ని రకాల అంశాలను ఇంటి వద్దకే వచ్చి బ్యాంకులు అందిస్తున్నాయన్నారు. ధర్మవరం అనేది దేశంలోనే హ్యాండ్లూమ్ రంగానికి ప్రసిద్ధిగాంచిందని, ఇక్కడ మంచి వినియోగదారులు ఉన్నారని, పాత బ్యాంకులను ప్రోత్సహించాలన్నారు.
పంజాబ్ నేషనల్ బ్యాంక్ హైదరాబాద్ జోనల్ హెడ్ మహమ్మద్ మాక్సూద్ అలీ మాట్లాడుతూ పంజాబ్ నేషనల్ బ్యాంక్ 10,500 పైచిలుకు బ్రాంచులు, 13,500 పై చిలుకు ఏటిఎంలు, 20 లక్షల కోట్లు వ్యాపారంతో దేశంలోనే రెండవ అతి పెద్ద బ్యాంక్ గా నిలిచిందన్నారు. పంజాబ్ నేషనల్ బ్యాంక్ సేవలు అందరూ ఉపయోగించుకుని సద్వినియోగం చేసుకోవాలని, బ్యాంకు అభివృద్ధికి పాటుపడాలన్నారు.బ్యాంక్ మేనేజర్ జయచంద్ర రెడ్డి మాట్లాడుతూ పంజాబ్ నేషనల్ బ్యాంక్ కి రాష్ట్రంలో ఇప్పటికే 134 బ్రాంచులు వుండగా, మరో 20 కొత్త బ్రాంచులు ప్రారంభిస్తామన్నారు. బ్యాంక్ ప్రస్తుతం గృహ, వాహన, బంగారు అభారణలపై రుణాలను అతి తక్కువ వడ్డీ రేట్లకే అందజేస్తోందని మరియు మార్చి 31 వరకు ఎటువంటి ప్రాసెస్సింగ్/ డాక్యుమెంటేషన్ చార్జీ లు ఉండబోవన్నారు.
ఈ కార్యక్రమంలో పంజాబ్ నేషనల్ బ్యాంక్ హైదరాబాద్ జోనల్ హెడ్ మహమ్మద్ మాక్సూద్ అలీ, విజయవాడ సర్కిల్ హెడ్ కృష్ణమూర్తి, పంజాబ్ నేషనల్ బ్యాంక్ జోనల్ హెడ్ మధుసూదన్, ఆర్డీఓ తిప్పేనాయక్, తహసీల్దార్ యుగేశ్వరిదేవి, పట్టణ ప్రముఖులు జగదీష్ బాబు, అనంతపురం విద్యావేత్త పల్లె రామకృష్ణ రెడ్డి, పంజాబ్ నేషనల్ బ్యాంక్ అధికారులు, సిబ్బంది, వినియోగదారులు, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img