Friday, April 26, 2024
Friday, April 26, 2024

పార్టీ మారే ముందు సిపిఐ ఎంపీటీసీ స్థానానికి రాజీనామా చేయాలి

విశాలాంధ్ర /ఉరవకొండ : ఉరవకొండ పట్టణంలోని తొమ్మిదవ ఎంపిటిసి స్థానాన్ని గత స్థానిక సంస్థల ఎన్నికల్లో సిపిఐ పార్టీ గెలవడం జరిగిందని అయితే గెలుపొందిన అభ్యర్థి వన్నూరు సాహెబ్‌ సిపిఐ పార్టీ ఎంపీటీసీ స్థానానికి రాజీనామా చేయకుండానే అధికార వైసిపి పార్టీలోకి చేరడాన్ని తాలూకా సిపిఐ పార్టీ నాయకులు తీవ్రంగా ఖండిరచారు. సోమవారం స్థానిక సిపిఐ పార్టీ కార్యాలయంలో పార్టీ తాలూకా కార్యదర్శి జె.మల్లికార్జున, సహాయ కార్యదర్శి మనోహర్‌, జిల్లా ఏఐటీయూసీ నాయకులు చెన్నారాయుడు, మరియు ఆ పార్టీ నాయకులు మాట్లాడుతూ వన్నూరు సాహెబ్‌ గెలవడానికి సిపిఐ పార్టీ కష్టపడి పని చేసిందని అయితే ఆయన వ్యక్తిగత స్వప్రయోజనాల కోసం సిపిఐ పార్టీ తరఫున గెలిచిన ఎంపీటీసీ స్థానానికి రాజీనామా చయకుండానే అధికార వైసిపిలో చేరడం సమంజసం కాదన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డి వేరే పార్టీలో గెలుపొందిన ప్రజాప్రతినిధులు రాజీనామా చేసి తమ పార్టీలోకి రావాలని గతంలో ప్రకటించడం జరిగిందని ఉరవకొండలో సిపిఐ పార్టీ ఎంపీటీసీ గా గెలుపొందిన వన్నూరు సాబ్‌ చేత ఎందుకు రాజీనామా చేయించలేదని ప్రశ్నించారు. వన్నూరు సాహెబ్‌ స్వచ్ఛందంగా రాజీనామా చేయాలని లేని పక్షంలో సిపిఐ పార్టీ తరఫున స్థానిక ఎంపీడీవో ను కలిసి ఒక పార్టీలో గెలుపొందిన అభ్యర్థి మరో పార్టీలోకి చేరడం వల్ల ఆయన సభ్యత్వాన్ని రద్దు చేయాలని కోరునున్నట్లు వారు తెలిపారు.ఈ విలేకరుల సమావేశంలో సిపిఐ పార్టీ సీనియర్‌ నాయకులు శ్రీధర్‌ మల్లేష్‌, ఉరవకొండ మండల కార్యదర్శి తలారి మల్లికార్జున వజ్రకరూరు మండల కార్యదర్శి సుల్తాన్‌, విడపనకల్లు కార్యదర్శి రమేష్‌, వన్నూరమ్మ, నూర్జహాన్‌, గణప మల్లికార్జున తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img