Friday, April 26, 2024
Friday, April 26, 2024

పేదల ఆశలను అడియాశలు చేస్తున్న జగన్‌ ప్రభుత్వం

లబ్ధిదారులకు టిడ్కో ఇళ్లను వెంటనే స్వాధీనం చేయాలి
సీపీఐ జిల్లా కార్యదర్శి వేమయ్య యాదవ్‌

విశాలాంధ్ర`కదిరి : పేదల సొంతింటి పట్ల నిర్లక్ష్యం వీడి, పూర్తైన టిడ్కో ఇళ్లను లబ్ధిదారులకు వెంటనే స్వాధీనం చేయాలని సీపీఐ జిల్లా కార్యదర్శి ఎం.వేమయ్య యాదవ్‌ డిమాండ్‌ చేశారు.సోమవారం ఆయన గత ప్రభుత్వ హాయంలో గట్ల వద్ద నిర్మించిన జి ప్లస్‌ త్రీ టిడ్కో ఇళ్ల వద్ద లబ్ధిదారులతో కలిసి నిరసన వ్యక్తం చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ గత ప్రభుత్వ హయాంలో షేర్‌ వాల్‌ టెక్నాలజీతో జి ప్లస్‌ త్రీ (జిం3) ఇళ్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టి కదిరి పట్టణం గట్ల వద్ద దాదాపు 2500 మంది లబ్ధిదారులకు నిర్మాణం పూర్తిచేసిన ఇళ్లను డబ్బులు కట్టిన లబ్ధిదారులకు స్వాధీనం చేయడంలో ప్రస్తుత ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డి ప్రభుత్వం మూడున్నర సంవత్సరాలుగా పేదల గూడు పట్ల మీనమేషాలు లెక్క వేస్తూ నిర్లక్ష్యంగా వ్యవహరించడం సబబు కాదన్నారు.ప్రజల పన్నులతో నిర్మించిన ఈ ఇల్లు శిధిలావస్థకు చేరకముందే ఇతర మౌలిక సౌకర్యాలను ఏర్పాటు చేసి నిర్మాణం పూర్తయిన టిడ్కో ఇళ్లను వెంటనే లబ్ధిదారులకు ప్రభుత్వం స్వాధీనం చేయాలని ఆయన డిమాండ్‌ చేశారు. అర్హులైన పేదలు ఇళ్ల స్థలాలు ఇల్లు లేక సంవత్సరాల తరబడి అద్దె ఇళ్లల్లో మగ్గిపోతు అద్దెలు కట్ట లేక ఊహించని ఇబ్బందులు పడుతూ జీవనం కొనసాగిస్తున్నారన్నారు.జగనన్న కాలనీలలో నిర్మిస్తున్న ఇళ్లకు ప్రస్తతం ఇస్తున్న లక్ష ఎనబై వేల రూపాయలు ఏమాత్రం సరి పోదని ఐదు లక్షల రూపాయలు మంజూరు చేసి కాలనీలో రోడ్లు, తాగు నీరు,మురుగు కాల్వలు తక్షణం ఏర్పాటు చేయాలని కోరారు. ఈకార్యక్రమంలో ఏఐ టియూసీ జిల్లా సహాయ కార్యదర్శి మధు నాయక్‌, ఏఐఎస్‌ఎఫ్‌ జిల్లా కార్యదర్శి రాజేంద్ర ప్రసాద్‌,పవన్‌, సిపిఐ నాయకులు ముబార క్‌,కమల్‌,సయ్యద్‌,అహమద్‌, అల్తాఫ్‌,బాబ్జాన్‌ తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img