Friday, April 26, 2024
Friday, April 26, 2024

బాల్య వివాహాలు.. దిశా చట్టంపై అవగాహన సదస్సు

విశాలాంధ్ర`శెట్టూరు : జిల్లా గ్రంధాలయ చైర్‌ పర్సన్‌ శ్రీమతి ఉమా మోహన్‌ రెడ్డి ఆదేశాల మేరకు 55వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాల భాగంగా దిశా చట్టం బాల్య వివాహాలు విద్యార్థులకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమం ముఖ్య అతిథులుగా ఎంపీపీ శ్రీమతి లక్ష్మీదేవి, గ్రామ సర్పంచ్‌ కుమార్‌, వైస్‌ ఎంపీపీ చెవులకిష్టప్ప, ఎంఈఓ శ్రీధర్‌ ముఖ్య అతిథిగా హాజరయ్యారు అనంతరం ఏర్పాటుచేసిన సమావేశంలో వారు మాట్లాడుతూ సమాజంలో మహిళల పట్ల జరుగుతున్న దాడులను అరికట్టడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం దిశా చట్టాన్ని ప్రవేశపెట్టిందని ప్రతి ఒక్కరు కూడా అవగాహన పెంచుకోవాలని వారు సూచించారు.అదేవిధంగా గ్రామీణ ప్రాంతంలో ఆంధ్ర కర్ణాటక సరిహద్దులో జరుగు బాల్య వివాహాలు వాటి స్థితిగతులు ఆవశ్యకత సమాజంలో జరుగుతున్న వాటి గురించి విద్యార్థులకు తెలియజేశారు విద్యార్థులు బాగా చదువుకొని ఇలాంటి వాటిపైన గ్రామీణ ప్రాంత ప్రజలకు మీరు వాటి గురించి అవగాహన కల్పించాలని తెలియజేశారు. ప్రతి విద్యార్థి కూడా చిన్న వయసులో బుక్కులు చదవడం అలవాటు చేసుకోవడం వల్ల సమాజంలో జరుగుతున్న వాటి గురించి తెలుసుకోవచ్చని మంచి జ్ఞానాన్ని వస్తుంది రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థుల కోసం డిజిటల్‌ లైబ్రరీ కూడా త్వరలో ప్రతి గ్రామసచివాలయం కూడా తీసుకొచ్చేందుకు కృషి చేస్తుందన్నారు గ్రంథాలయంలో పత్రికలు, చరిత్ర పుస్తకాలు, పోటీ పరీక్షలు కావలసిన మెటీరియల్స్‌ కూడా అందుబాటులో ఉంటామని ప్రతి విద్యార్థి కూడా వాటిని సద్విని చేసుకోవాలని వారు విద్యార్థులకు తెలియజేశారు అనంతరం వివిధ పోటీల్లో గెలుపొందిన విద్యార్థులకు బహుమతులు ప్రధానం చేశారు ఈ కార్యక్రమంలో వైసిపి నాయకుడు ఎమ్మెస్‌ రాయుడు, గ్రంథాలయ అధికారి రజిని, ఉపాధ్యాయులు రాయల వెంకటేశులు, చెన్నారెడ్డి, వెంకటేష్‌, మల్లికార్జున, ఖాదర్‌ బాషా, వివిధ పాఠశాల విద్యార్థిని విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img