Friday, May 10, 2024
Friday, May 10, 2024

భూ దోపిడీ అక్రమ రిజిస్ట్రేషన్ లపై నిప్పులు చె రిగిన పరిటాల శ్రీరామ్

విశాలాంధ్ర ధర్మవరం:: పట్టణంలోని సబ్ రిజిస్టార్ కార్యాలయం యొక్క పని తీరుపై అసహనం వ్యక్తం చేస్తూ భూ దోపిడీ, అక్రమ రిజిస్ట్రేషన్ లను ఎలా చేస్తారని సబ్ రిజిస్టర్ పై పరిటాల శ్రీరామ్ మండిపడ్డారు. ఈ సందర్భంగా పరిటాల శ్రీరామ్ మంగళవారం కొంతమంది బాధితులు మేరకు సబ్ రిజిస్టర్ కార్యాలయానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ధర్మవరంలోని రిజిస్టర్ కార్యాలయమా?లేక వైసిపి కార్యాలయమా?అన్నది సందిగ్ధంగా ఉందని వారు తెలిపారు. కోర్టు ఆదేశాలు ఉన్న..రిజిస్టర్ రిజిస్ట్రేషన్లు ఎలా చేస్తారని?. నియమ, నిబంధనలు పాటించరా? అని వారు ప్రశ్నించారు. ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా ఉన్న కాలనీలో జరుగుతున్న రిజిస్ట్రేషన్ ల మీద పరిటాల శ్రీరామ్ తీవ్రంగా స్పందించారు. ఇప్పటికే ఇక్కడ రెండు సర్వే నెంబర్లకు సంబంధించిన రిజిస్ట్రేషన్లు, ఇతర కార్యకలాపాలను ఆపివేయాలని కోర్టు ఆదేశించలేదా అని అడగడం జరిగిందన్నారు. అయినప్పటికీ రిజిస్ట్రేషన్లు ఎలా చేస్తున్నారని మండిపడ్డారు. సబ్ రిజిస్టర్ ద్వారా నిషేధిత జాబితా మా వద్ద లేదని… చెప్పడంతో పరిటాల శ్రీరామ్ ఆశ్చర్యానికి గురయ్యారు. ఇప్పటికైనా మించిది లేదని కోర్టు ఉత్తర్వులను గౌరవించి రిజిస్ట్రేషన్లు ఆపాలని సబ్ రిజిస్టార్ అధికారిని వారు కోరారు. అంతేకాకుండా కొన్ని కాలనీలో రోడ్లను కూడా కబ్జా చేసి రిజిస్ట్రేషన్లు చేసుకుంటున్నారని పరిస్థితి ఇలాగే ఉంటే ఒక కాలనీ నుంచి మరొక కాలనీకి వెళ్లాలంటే టోల్ చెల్లించాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని తెలిపారు. సబ్ రిజిస్టార్ కార్యాలయంలో కొందరు బ్రోకర్లు చెప్పిందే రాజ్యాంగ నడవడం సరైన పద్ధతి కాదని, మీ ఉద్యోగాన్ని నీతి, నిజాయితీగా అందరికీ న్యాయం చేసేలా ఉండాలని, వారు సలహా ఇచ్చారు. కార్యాలయం ముందు లంచాలకు సంబంధించిన బోర్డ్ ఎందుకు తీసేసారని వారు ప్రశ్నించారు. అంతేకాకుండా ప్రతి రిజిస్ట్రేషన్ మీద కమీషన్ కూడా వెళుతున్నట్లు ఆరోపణలు ఉన్నాయని వారు గుర్తు చేశారు. ఇష్టారాజ్యంగా ఎన్ఓసీలు సృష్టించి రిజిస్ట్రేషన్ చేయడం మంచి పద్ధతి కాదని తెలిపారు. బాధితులు కూడా అప్రమత్తంగా ఉండాలని, వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ తప్పక అందరికీ న్యాయం చేస్తుందని తెలిపారు. నాలుగు సంవత్సరాలుగా భూ దోపిడీకి హద్దే లేకుండా పోయిందని, బాధితులు ధైర్యంగా ముందుకు వస్తే తాను ఎల్లప్పుడూ అండగా ఉంటానని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img