Friday, April 26, 2024
Friday, April 26, 2024

మండల సర్వసభ్య సమావేశం

విశాలాంధ్ర- పెనుకొండ : పెనుకొండ మండల పరిషత్ సమావేశ భవనం నందు మంగళవారం మండల పరిషత్ అధ్యక్షులు గీతా రామ్మోహన్ రెడ్డి అధ్యక్షతన మండల సర్వసభ్య సమావేశం నిర్వహించారు ఈ సమావేశానికి అధికారులు సర్పంచులు ఎంపీటీసీలు పంచాయతీ కార్యదర్శులు సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు ముఖ్యంగా అజెండాలోని అంశాలను ప్రస్తావిస్తూ వెలుగు ద్వారా నిర్వహిస్తున్న మహిళా సంఘాల పై ఎక్కువగా చర్చ జరిగింది జడ్పిటిసి సభ్యులు శ్రీరాములు ప్రస్తావిస్తూ గ్రామాలలో యానిమేటర్లు స్వయం సహాయక సంఘాల లీడర్లతోనూ సభ్యులతోనూ నెలవారీ కంతులు కట్టించుకుని వారు మొత్తాన్ని బ్యాంకులో జమ చేస్తున్నారా లేదా వారికి నగదు చెల్లించినట్లు ఏవైనా రుజువు పత్రాలు మంజూరు ఇస్తున్నారా లేదా ఒకవేళ లీడర్లు కానీ యానిమేటర్లు కానీ గ్రూప్ సభ్యుల యొక్క మొత్తాన్ని అవకతవక్కలు చేసిన ఎడల వాటికి బాధ్యత ఎవరిదని చదువురాని వారు చెల్లిస్తూ ఉంటే వారు 10 కంతులు చెల్లించాల్సి ఉండగా యానిమేటర్లు ఇష్టం వచ్చినట్లు గ్రామాలలో కంతులు కట్టించుకుని సభ్యులను మోసం చేస్తున్నారని వాటి పర్యవేక్షణ ఆడిటింగ్ విషయాలను అధికారులు చూడవలసిన బాధ్యత ఉందని ఆయన తెలిపారు ఈ విషయానికి ఏపీఎం రవీంద్రారెడ్డి సరైనటువంటి సంతృప్తికరమైనటువంటి సమాధానం చెప్పలేక పోయారు ఏపీఎం సమాధానము సరిగా లేదని వాటి పర్యవేక్షణ పెంచాల్సిన బాధ్యత ఉందని శ్రీరాములు తెలిపారు ఈ కార్యక్రమంలో మండల ఉపాధ్యక్షులు రామాంజనేయులు మండల పరిషత్ అభివృద్ధి అధికారి శివ శంకరప్ప తదితరులు పాల్గొన్నారు

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img