Friday, April 26, 2024
Friday, April 26, 2024

ముగిసిన వైకుంఠ ఏకాదశి మహోత్సవ వేడుకలు

విశాలాంధ్ర -ధర్మవరం : పట్టణములోని శ్రీనివాస నగర్లో గల శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో ఈనెల 1వ తేదీ నుండి మూడవ తేదీ వరకు మూడు రోజులపాటు దేవాలయ అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి వారి వైకుంఠ ఏకాదశి మహోత్సవ వేడుకలు అంగరంగ వైభవంగా, వేద మంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ ఘనంగా నిర్వహించుకున్నారు. ఇందులో భాగంగా మంగళవారం చివరి రోజు ఉదయం స్వామివారికి ప్రత్యేక అలంకరణతో పాటు, ప్రత్యేక పూజలను అర్చకులు రాజేష్ ఆచార్యులు, మోహన స్వామి నిర్వహించారు. తదుపరి శాంతిహోమం, కలశ ఉద్వాసన, కలసోదకమార్జన, పూర్ణాహుతి ,మహా మంగళహారతి కార్యక్రమాలు భక్తాదులు, దాతల నడుమ ఎంతో వైభవంగా వేదమంత్రాలతో దాదాపు రెండు గంటల పాటు నిర్వహించారు. ఈ సందర్భంగా అభివృద్ధి కమిటీ అధ్యక్షులు చెన్నం శెట్టి జగదీశ్వర ప్రసాద్, శ్రీనివాసులు, రమేష్ కుమార్ ,జింక రాజేంద్రప్రసాదు మాట్లాడుతూ పట్టణ ప్రజలందరూ కూడా మున్ముందు కరోనా తో బాధపడకుండా వాటిని నివారించేందుకు ఈ హోమాలను నిర్వహించామని, ప్రజల కష్టాలు తొలగి, రైతులకు అధిక దిగుబడిలో పంటలు పండాలన్న ఉద్దేశంతో చేయడం జరిగిందన్నారు. అనంతరం అన్నదాన కార్యక్రమానికి దాతగా దాసరి వెంకటేశులు ( చిట్టి) వారి కుటుంబం వ్యవహరించారు. దాత పేరిటన ప్రత్యేక పూజలు నిర్వహించిన తదుపరి, ఘనంగా వారిని కమిటీ వారు సన్మానించారు. అనంతరం అన్నదాన కార్యక్రమానికి 2000 మంది భక్తాదులు పాల్గొన్నారు. ఈ వేడుకలకు ప్రత్యక్షంగా, పరోక్షంగా సహాయ సహకారాలు అందించిన వారందరికీ కూడా ఆలయ అభివృద్ధి కమిటీ పేరుపేరునా కృతజ్ఞతలు తెలియజేశారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img