Saturday, April 27, 2024
Saturday, April 27, 2024

వైద్య ఆరోగ్య శాఖలో కాలపరిమితి దాటిన 32 వాహనాలు ఈ-వేలం

విశాలాంధ్ర – అనంతపురం వైద్యం : ప్రభుత్వ ఉత్తర్వుల ను అనుసరించి జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డా. పి.యుగంధర్‌ ఆధ్వర్యంలో జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికార కార్యాలయం లో సోమవారం జిల్లా కండ్మినేషన్‌ వాహనాల కమిటీ సమావేశాన్ని నిర్వహించడం జరిగిందని మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈ సందర్భంగా డా. పి.యుగంధర్‌ మాట్లాడుతూ… ప్రభుత్వ అనుమతి పొంది జిల్లాలో వైద్యారోగ్య శాఖ పరిధిలోని కాలపరిమితి దాటిన 32 వాహనాలను ఈ – కొనుగోలు చేయుట కొరకు పోర్టల్‌ ద్వారా ఈ-వేలం పాట నిర్వహించుటకు నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. ప్రభుత్వ ఉత్తర్వులకు అనుగుణంగా విధివిధానాలను రూపొందించి ఈ – వేలం పాట నిర్వహించుటకు తీర్మానము చేశారని అన్నారు. ఈ సమావేశంలో మొత్తము వాహనాలను రెండు సమూహములుగా విభజించి జనవరి నెలలో ఈ-వేలం పాట నిర్వహిస్తామని అన్నారు. దీని కొరకై గుర్తింపు పొందిన పాటదారులు కనీస రుసుము జమచేసి ఈ-వేలం పాట ద్వారా పాల్గొనవచ్చు అని తెలిపారు. ఈ- వేలం పాటకు సంబంధించిన నిబంధనలు, షరతులు అన్నీ కూడా చట్టప్రకారం వర్తిస్తాయని అన్నారు. దీనికి సంబంధించిన పూర్తి నిర్ణయాధికారము జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారి పరిధిలో వుంటుంది అని ఆయన పేర్కొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img