Friday, April 26, 2024
Friday, April 26, 2024

వైభవంగా అడ్డపల్లకి గ్రామోత్సవం

పల్లకిలో ఊరేగిన గవిమఠం పీఠాధిపతి

విశాలాంధ్ర-ఉరవకొండ : ఆంధ్ర,కర్ణాటక రాష్ట్రాలలో ప్రసిద్ధి చెందిన ఉరవకొండ పట్టణంలో గవి మఠం శ్రీ స్థితి చంద్రమౌళీశ్వర స్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా సోమవారం ఉదయం అడ్డపల్లికి గ్రామోత్సవం వైభవంగా జరిగింది పట్టణంలోని వెలగొండ రహదారిలో ఉన్న విడిది మఠంలో పీఠాధిపతికి గవి మఠం సహాయ కమిషనర్ చిట్టెమ్మ అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించి అనంతరం పీఠాధిపతి, చెన్న బసవ రాజేంద్ర స్వాముల వారిని పల్లకిలో కూర్చోబెట్టి పురవీధుల గుండా మేళా తాళాలు సాంప్రదాయ నృత్యాలు నడుమ ఊరేగించారు. ఈ సందర్భంగా వివిధ రాష్ట్రాలకి చెందిన కళాకారులు శివ తాండవంతో పాటు వీరభద్ర వేషధారణ నృత్యం పలువురుని ఆకట్టుకున్నాయి డప్పు వాయిద్యాలు కళాకారులు చేసిన నృత్యాలు, వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు చూపర్లను కట్టిపడే సాయి ఈ ఉత్సవంలో గవి మఠం( ఏనుగు) గజలక్ష్మి ప్రధాన ఆకర్షణగా నిలిచింది ఈ కార్యక్రమంలో గవి మఠం ఉత్తరాధికారి కరిపసవ రాజేంద్ర స్వామి, ఏజెంట్ రాజన్న గౌడ్,ఆదోని చౌకి పీఠాధిపతి కళ్యాణ స్వామి దేవదాయ శాఖ అధికారులు, మఠం సిబ్బంది, వేలాది మంది భక్తులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img