Saturday, April 27, 2024
Saturday, April 27, 2024

సాఫ్ట్‌ స్కిల్స్‌, అటిట్యూడ్‌తో ఉద్యోగాలు

విశాలాంధ్ర-రాప్తాడు : ఇంజనీరింగ్‌ విద్య పూర్తయ్యలోపు ఉద్యోగం సాధించాలంటే కమ్యూనికేషన్‌ స్కిల్స్‌ సాఫ్ట్‌ స్కిల్స్‌ పాజిటివ్‌ ఆటిట్యూడ్‌ గ్రూప్‌ డిస్కషన్స్‌ లో ప్రతిభ ఉంటే సులువుగా సాధ్యవుతుందని జేఎన్టీయూ హెచ్‌ అండ్‌ యస్‌ విభాగాధిపతి వీబీ చిత్ర, సుశీల తెలిపారు. హంపాపురం సమీపంలోని ఎస్వీఐటీ ఇంజినీరింగ్‌ కళాశాలలో గురువారం ట్రైనింగ్‌ అండ్‌ ప్లేస్మెంట్‌ విభాగం ఆధ్వర్యంలో వెర్బల్‌ అండ్‌ నాన్‌ వెర్బల్‌, సాఫ్ట్‌ స్కిల్స్‌ పై విద్యార్థులకు శిక్షణ ఇచ్చారు. వారు మాట్లాడుతూ చదువు పూర్తయ్యేలోపు అనుకున్న లక్ష్యాన్ని సాధించాలని తపన, లక్ష్యంతో తరగతి గదిలోనే వినూత్న ప్రయోగాలు చేయవలసి ఉంటుందన్నారు. ఉపాధ్యాయుల బోధనతోపాటు సమాజంలో నిత్యం చోటు చేసుకునే సంఘటనల గురించి స్పష్టమైన అవగాహన పెంచుకుంటే భవిష్యత్తులో ఉన్నతస్థాయికి ఎదగవచ్చన్నారు. కార్యక్రమంలో కళాశాల కరస్పాండెంట్‌ వీబీఆర్‌ శర్మ, చైర్మన్‌ బీవీ కృష్ణారెడ్డి, వైస్‌ చైర్మన్‌ వెన్నెపూస రవీంద్రరెడ్డి, సీఈఓ ఆనంద్‌ కుమార్‌, ప్రిన్సిపాల్‌ డా.టి.సూర్యశేఖర రెడ్డి, ట్రైనింగ్‌ అండ్‌ ప్లేస్మెంట్‌ అధికారి డీ.రాఘవరాజు, ఎ. పావని, కల్యాణి, శ్రీదేవి, గౌసియా, ఎన్‌ఎస్‌ఎస్‌ కో ఆర్డినేటర్‌ ఎం.శ్రీనివాసులు నాయక్‌, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img