Friday, April 26, 2024
Friday, April 26, 2024

హై మాక్స్ లైట్ల ఏర్పాటు పనులు పరిశీలన

విశాలాంధ్ర- ఉరవకొండ : ఉరవకొండలో నూతనంగా ఏర్పాటు చేస్తున్న హైమాక్స్ లైట్ల నిర్మాణం పనులను సోమవారం వైఎస్ఆర్సిపి పార్టీ నాయకుల పరిశీలించారు పట్టణంలోని స్థానిక కవిత హోటల్ సర్కిల్, బైపాస్, కనేకల్ క్రాస్, గుంతకల్ రోడ్డు తదితర ప్రాంతాల్లో రూ.10 లక్షల పంచాయతీ నిధులతో ఏర్పాటు చేస్తున్న ఈ పనులను ఉరవకొండ మాజీ ఎమ్మెల్యే వై విశ్వేశ్వర రెడ్డి ఈనెల తొమ్మిదవ తేదీన ప్రారంభించారు. వైస్సార్ సర్కిల్ వద్ద బెడ్డింగ్ పిల్లర్ నిర్మాణం పనులను పరిశీలించిన వైఎస్ఆర్సిపి ఎస్సీ సెల్ రాష్ట్ర కార్యదర్శి బసవరాజు, వార్డు సభ్యులు నిరంజన్ గౌడ్, శర్మస్ తదితరులు మాట్లాడుతూ 15 రోజుల్లో వీటి ఏర్పాటు పూర్తి చేస్తామని చెప్పారు. మాజీ ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి, పంచాయతీ పాలకవర్గ సహకారంతో మరిన్ని పనులు చేపడతామని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సిపి పార్టీ నాయకులు వార్డు సభ్యులు పాల్గొన్నారు

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img