Saturday, April 27, 2024
Saturday, April 27, 2024

పదవ తరగతి పరీక్షలు ఏర్పాట్లు సర్వం సిద్ధం.. డీఈఓ మీనాక్షి దేవి

విశాలాంధ్ర -ధర్మవరం : ప్రభుత్వ ఆదేశాల మేరకు పదవ తరగతి పబ్లిక్ పరీక్షలు ధర్మవరంలో 15 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగిందని, ఆ పరీక్షా కేంద్రాలలో మౌలిక సదుపాయాలు అన్నీ కూడా సర్వం సిద్ధం చేయడం జరిగిందని డీఈవో మీనాక్షి దేవి పేర్కొన్నారు. ఈ సందర్భంగా శుక్రవారం వారు మాట్లాడుతూ పట్టణంలో పరీక్షా కేంద్రాలు ప్రభుత్వ ఉన్నత పాఠశాల, సంజయ్ నగర్ లోని బిఎస్సార్ మున్సిపల్ బాలుర పాఠశాల, బి ఎస్ ఆర్ మున్సిపల్ బాలికల పాఠశాల, జీవి ఈ జెడ్పి బాలికల ఉన్నత పాఠశాల, కొత్తపేటలోని మున్సిపల్ బాలికల ఉన్నత పాఠశాల, కొత్తపేటలోని ఎస్పిసిఎస్.. మున్సిపల్ బాలుర ఉన్నత పాఠశాల, విశ్వభారతి ఇంగ్లీష్ మీడియం హై స్కూల్, కొత్తపేటలోని శ్రీ ఉషోదయ ఇంగ్లీష్ మీడియం హై స్కూల్, కాకతీయ విద్యా నికేతన్, సాయి నగర్ లోని లయోలా ఇంగ్లీష్ మీడియం హై స్కూల్, సుందరయ్య నగర్ లోని శ్రీ గణేష్ మున్సిపల్ హై స్కూల్, జీవన్ జ్యోతి ఇంగ్లీష్ మీడియం హై స్కూల్, జీవానంద ఇంగ్లీష్ మీడియం హై స్కూల్, యశోద కాన్సెప్ట్ ఇంగ్లీష్ మీడియం హై స్కూల్, ప్రియదర్శిని విద్యా మందిర్ లలో పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. మొత్తం 2,510 మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారని తెలిపారు. పరీక్షలు ఉదయం 9:30 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల 45 నిమిషముల వరకు జరుగుతాయన్నారు. పరిష కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలులో ఉంటుందని, ప్రతి పరీక్షా కేంద్రంలో మౌలిక సదుపాయాలతో పాటు తాగునీరు, వైద్య సేవలు కూడా అందించబడునని తెలిపారు. సమస్యత్మక పరీక్షా కేంద్రాలపై ప్రత్యేక నిగా ఉంచడంతోపాటు సిట్టింగు, ఫ్లయింగ్ స్క్వైడ్ లు కూడా ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ప్రశ్న పత్రాలు లీకు కాకుండా తగు చర్యలను కూడా తీసుకోవడం జరిగిందన్నారు. అంతేకాకుండా పరీక్ష కేంద్రాలకు విద్యార్థులు 8:30కే చేరుకునేలా తల్లిదండ్రులు సహకరించాలని వారు తెలిపారు. పరీక్ష సమయంలో పట్టణములో జిరాక్స్ సెంటర్లను పూర్తిగా మూసివేయాలని వారు తెలిపారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img