హాకీ ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యక్షులు సూర్యప్రకాష్
విశాలాంధ్ర – ధర్మవరం:: ఈనెల 27వ తేదీ నుండి 30వ తేదీ వరకు శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరంలో హాకీ ఆంధ్రప్రదేశ్ సౌజన్యంతో, హాకీ సత్యసాయి జిల్లా వారి ఆధ్వర్యంలో 14వ అంతర్ జిల్లాల సీనియర్ పురుషుల హాకీ పోటీలను నిర్వహిస్తున్నట్లు హాకీ ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యక్షులు సూర్యప్రకాష్ తెలిపారు. అనంతరం వారు మాట్లాడుతూ రాష్ట్రస్థాయి సీనియర్ హాకీ పోటీలలో 20 జిల్లా జట్లు పాల్గొంటున్నాయని ఈ పోటీలలో పాల్గొని జిల్లా నుండి సుమారు 40 మందిని అత్యంత నైపుణ్యత ఘనపరిచిన క్రీడాకారులను ఎంపిక చేయడం జరుగుతుందన్నారు. అనంతరం వీరికి కోచింగ్ క్యాంపు నిర్వహించి హాకీ ఆంధ్రప్రదేశ్ జట్టును ఎంపిక చేసి, నవంబర్ నెలలో పూణేలో జరిగే జాతీయ హాకీ పోటీలలో హాకీ ఆంధ్రప్రదేశ్ సీనియర్ పురుషుల హాకీ జట్టు పాల్గొంటుందని వారు తెలియజేశారు.