Tuesday, May 21, 2024
Tuesday, May 21, 2024

21న స్కూల్‌ గేమ్స్‌ జిల్లా ఖోఖో జట్లు ఎంపిక

విశాలాంధ్ర`ఉరవకొండ : ఈనెల 21వ తేదీన స్కూల్‌ గేమ్స్‌ ఖోఖో జిల్లా జట్లను ఉరవకొండ మండలం ఆమిద్యాల ప్రభుత్వ జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో ఎంపిక చేస్తున్నట్లు హైస్కూల్‌ హెచ్‌ఎం నాగ మంజుల ఫిజికల్‌ డైరెక్టర్‌ మారుతి ప్రసాద్‌ తెలిపారు. ఈ సందర్భంగా శనివారం వారు విలేకరులతో మాట్లాడుతూ స్కూల్‌ గేమ్స్‌ రాష్ట్ర కార్యదర్శి భానుమూర్తి ఆదేశాలు మేరకు అండర్‌ 14 అండర్‌ 17 బాల బాలికలకు సంబంధించిన జట్లను ఎంపిక చేస్తున్నట్లు పేర్కొన్నారు అనంతపురం మరియు సత్యసాయి జిల్లాలనుంచి 750 మంది క్రీడాకారులు పాల్గొంటున్నారని వారికోసం అదనపు ఆట స్థలాలు,భోజనం వసతి కూడా కల్పిస్తున్నట్లు పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో అనంతపురం స్కూల్‌ గేమ్స్‌ కార్యదర్శి రవికుమార్‌ సత్య సాయి జిల్లా కార్యదర్శి అంజన్న పాల్గొన్నారు

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img