Friday, April 26, 2024
Friday, April 26, 2024

ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజలకు చేరవేయడంలో సచివాలయ ఉద్యోగులే కీలక పాత్రులు కావాలి..

జిల్లా కలెక్టర్ బసంత్ కుమార్
విశాలాంధ్ర -ధర్మవరం : ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజలకు చేరవేయడంలో సచివాలయ ఉద్యోగులే కీలక పాత్రలుగా బాధ్యత వహించాలని కలెక్టర్ బసంత్ కుమార్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మంగళవారం పట్టణంలోనిఎల్ సి కే పురం, పార్థసారథి నగర్-1, పార్థసారధి నగర్-2 లా సచివాలయాలను ఆకస్మికంగా తనిఖీ నిర్వహించారు. ఈ సందర్భంగా సచివాలయంలో నిర్వహించబడే ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలు తీరును తెలిపే రిజిస్టర్లను, కంప్యూటర్లో నమోదు చేసిన తీరును వారు పరిశీలించారు. అనంతరం సచివాలయములో అన్ని విభాగాల సిబ్బందులతో వారి విధులలో చేపట్టిన ప్రగతి వివరాలు, టార్గెట్ ఎంతవరకు చేరుకున్నారు? అన్న విషయాలను నేరుగా వారితో మాట్లాడారు. ఓ సచివాలయంలో ప్రభుత్వం ద్వారా ముద్రణ అయిన విజిట్ రిజిస్టర్ పుస్తకములో ఇంతవరకు ఖాళీగా ఉన్న విషయాన్ని గమనించి, ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. తదుపరి సచివాలయంలో ప్రభుత్వ సంక్షేమ పథకాలను తెలిపే పోస్టర్లు కూడా తనిఖీ చేసి, ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారా? లేదా? అన్న విషయాన్ని కూడా వారు ఆరా తీశారు. ప్రభుత్వ సంక్షేమ పథకానికి సంబంధించిన ప్రతి ఒక్క రిజిస్టరు ఎప్పటికప్పుడు పూర్తి చేయాలని, లేనిచో కఠిన చర్యలు తప్పవని తెలిపారు. సచివాలయానికి అడ్మిన్ కార్యదర్శి ముఖ్య అధికారిగా ఉంటాడని, వారితో సిబ్బంది సమన్వయంతో పని చేయాలని సూచించారు. సచివాలయంలో వచ్చే ప్రతి ఫిర్యాదును కేటాయించిన తేదీలోగా, అధికారులతో సంప్రదించి పరిష్కరించేలా చర్యలు చేపట్టాలని ఉద్యోగులకు సూచించారు. మీ వీధుల్లో బాధ్యతగా పనిచేసినప్పుడే సచివాలయానికి మంచి గుర్తింపు వస్తుందని తెలిపారు. ప్రభుత్వానికి సచివాలయాలే పునాదులని తెలిపారు. ప్రతి సంక్షేమ పథకాన్ని ప్రజల్లో పూర్తిగా అవగాహన కల్పించినప్పుడే ప్రజలకు అది వినియోగం అవుతుందని తెలిపారు. మీరు చేసే వృత్తిని దైవంగా భావించి, బాధ్యతతో, సేవా భావంతో ఉంటూ, సచివాలయానికి వచ్చే ప్రతి వ్యక్తిని కూడా గౌరవంగా పలకరించి సమస్యను పరిష్కరించే దిశలో కృషి చేసినప్పుడే ప్రజల్లో మీరు మంచి మన్ననలు తోపాటు మంచి గుర్తింపు కూడా తెచ్చుకుంటారని తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ మల్లికార్జున, తహసిల్దార్ యుగేశ్వరీ దేవి, ఆయా వార్డుల కౌన్సిలర్లు మేడాపురం వెంకటేష్, రాయపాటి రామకృష్ణ ,గోరకాటి పురుషోత్తం రెడ్డి, హౌసింగ్ ఈఈ మునీశ్వర నాయుడు, సచివాలయాల అడ్మిన్ కార్యదర్శులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img