విశాలాంధ్ర -ఉరవకొండ : ఆంధ్రప్రదేశ్లో అత్యంత వెనకబడిన రజక కులస్తులను ఎస్టీ జాబితాలో చేర్చడానికి కేంద్ర ప్రభుత్వంతో చర్చించి సహకరించాలని రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు సోము వీర రాజుకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రజక కార్పొరేషన్ మాజీ చైర్మన్ సి. నాగేశ్వరరావు విజ్ఞప్తి చేశారు. బుధవారం బిజెపి రాష్ట్ర అధ్యక్షులు ఉరవకొండ కి రావడంతో ఆయనను నాగేశ్వరరావు కలిసి పలు సమస్యలపై వినతిపత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా నాగేశ్వరరావు మాట్లాడుతూ దేశంలో 18 రాష్ట్రాలలో రజకులు ఎస్టీ జాబితాలో కొనసాగుతున్నారని ఆంధ్రప్రదేశ్ తో పాటు మిగిలిన రాష్ట్రాలలో కూడా రజకులను ఎస్టీ జాబితాలో చేర్చాలని కోరారు. రజకులు విద్యా రాజకీయ, ఆర్థిక,సామాజికంగా అన్ని రంగాల్లో కూడా వెనకబడి ఉన్నారని ఎస్టీ జాబితాలో చేరిస్తే వారు అన్ని రంగాల్లో కూడా ముందడుగు వేస్తారని కోరారు