Saturday, April 20, 2024
Saturday, April 20, 2024

అంబేడ్కర్ విగ్రహం ఏర్పాటు చేసి తీరుతాం

విశాలాంధ్ర – బుక్కరాయసముద్రం: భారత రాజ్యాంగ నిర్మాత డా. బిఆర్ అంబేద్కర్ విగ్రహం ఎన్ని అడ్డంకులు సృష్టించినా ఏర్పాటు చేసి తీరుతామని ఎస్సీ,ఎస్టీ సంఘాల జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు సాకే హరి పేర్కొన్నారు.గురువారం బుక్కరాయ సముద్రం మండలం కేంద్రంలో డిప్యూటీ తహశీల్దార్ నారాయణ స్వామి,ఎంపీడీఓ తేజోష్ణకు అయా కార్యాలయాల్లో జే,ఏ,సీ అధ్వర్యంలో కలసి వినతి పత్రం అందజేశారు.అనతరం సాకే హరి మాట్లాడుతూ..మండల పరిధిలోని సిద్దరాంపురం గ్రామంలోని సర్వే నం 139-2Aలో ఎస్సీ కాలనీలో దాదాపు 40సెంట్లు స్థలం ఉందని దీనిని కబ్జా చేశారన్నారు. ఆ స్థలంలో అంబేద్కర్ విగ్రహం పెట్టాలని యువత ముందుకు వస్తే రాజకీయ శక్తులు అడ్డుకున్నారని వాపోయారు.సర్పంచ్ అధికార బలంతో అడ్డు తగలడం సరైన విధానం కాదన్నారు.ఈ కార్యక్రమంలో పూసల సంఘం జిల్లా అధ్యక్షుడు హనుమంతు.కోమటి.శేషు.జే,ఏ,సీ నాయకులు రేకలకుంట రామాంజనేయులు.కాశప్ప.కొండన్న.గోవిందంపల్లి నారాయణ స్వామి.వెంకటాపురం రామచంద్ర పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img