Saturday, May 4, 2024
Saturday, May 4, 2024

వేలాదిమందితో అనంత అర్బన్ అభ్యర్థి సిపిఐ సీ.జాఫర్ నామినేషన్

పదేళ్ల కాలంలో అభివృద్ధి శూన్యం… సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె. రామకృష్ణ

విశాలాంధ్ర అనంతపురం వైద్యం భారతీయ జనతా పార్టీ గద్దె దింపాలంటే ఇండియా కూటమి తరుపున పోటీ చేస్తున్న ఎంపీలను భారీ మెజారిటీతో గెలిపించినప్పుడే సాధ్యమవుతుందని సిపిఐ పార్టీ రాష్ట్ర కార్యదర్శి కే రామకృష్ణ పేర్కొన్నారు. మంగళవారం ఇండియా కూటమి ఆధ్వర్యంలో సిపిఐ పార్టీ అనంత అర్బన్ అభ్యర్థిగా సి. జాఫర్ నామినేషన్ ర్యాలీని కృష్ణ కళామందిర్ నుంచి ఆర్డీవో కార్యాలయం వరకు వేలాదిమంది కార్యకర్తలు అభిమానులతో అనంత పట్టణం సిపిఐ,కాంగ్రెస్ జెండాలతో, నిర్వహించారు. ఈ కార్యక్రమం లో జిల్లా సహాయ కార్యదర్శి పాల్యం నారాయణస్వామి అధ్యక్షత వహించగా ముఖ్య అతిథులుగా సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ,రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఓబులేసు, జగదీష్, సిపిఎం కార్యవర్గ సభ్యులు రాంభూపాల్, కాంగ్రెస్ పార్టీ మాజీ మంత్రి శైలజనాథ్, సిపిఐ అనంత అర్బన్ అభ్యర్థి సీ. జాఫర్, కాంగ్రెస్ పార్టీ అనంతపురం ఎంపీ పాలమల్లి , జిల్లా సహాయ కార్యదర్శి మల్లికార్జున్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కే రామకృష్ణ మాట్లాడుతూ… రాష్ట్రవ్యాప్తంగా అసెంబ్లీ, దేశవ్యాప్తంగా పార్లమెంట్ ఎన్నికలు జరుగుతున్నాయన్నారు. దేశవ్యాప్తంగా 542 పార్లమెంటు స్థానాల్లో ఎన్నికల జరుగుతున్నాయి. మన రాష్ట్రంలో తెలుగుదేశం, జనసేన, వై ఎస్ ఆర్ పార్టీలు భారతీయ జనతా పార్టీకి మద్దతు పలకడానికి పోటీ పడుతున్నారన్నారు. నరేంద్ర మోడీ వచ్చి పది సంవత్సరాల కాలంలో అంబానీలు,ఆదాని కార్పొరేట్లకు పెంచి పోషిస్తూ సాధారణ ప్రజల సమస్యలను పరిష్కరించకుండా ఈ దేశాన్ని పేదరికాన్ని పెంచి పోషిస్తున్నాడు అన్నారు. రైతుల సమస్యలపై పోరాడే వాళ్ళ మీద ఉక్కు పాదం వేస్తున్నారు అన్నారు. యువతకు సంవత్సరానికి రెండు కోట్ల మందికి ఉద్యోగాలు ఇప్పిస్తామని వాగ్దానం చేసి యువతను మోసం చేశారన్నాడు. విదేశీ బ్యాంకు లో ఉండే నల్ల డబ్బును వెనక్కి తెప్పిస్తాను అన్న ఈ పెద్దమనిషి ఈరోజు జాతీయ బ్యాంకుల్లో రుణాలు ఎగ్గొట్టి విదేశాలు వెళ్తుంటే వారి మీద ఎటువంటి చర్య తీసుకోలేదన్నారు. దేశంలో కోట్ల మంది ముస్లిం, క్రైస్తవులకు వ్యతిరేకంగా విష ప్రచారం చేస్తున్నారన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ప్రైవేట్ ప్రాపర్టీ లను ముస్లింలకు పంచుతారని చెప్పి ముస్లింలకు వ్యతిరేకంగా హిందువులను రెచ్చగొడుతున్నారన్నారు. భారతదేశ ప్రమాదంలో ఉందని కేంద్రంలో బిజెపి పార్టీ వస్తే కచ్చితంగా అంబేద్కర్ రాజ్యాంగం అమల్లో ఉండదన్నారు. రాజ్యాంగాన్ని పక్కనపడేసి దేశంలో లౌకికవాదం , ప్రజాస్వామ్యం ఉండదన్నారు. ఆంధ్ర రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల కంటే పార్లమెంట్ ఎన్నికలు కీలకమైందన్నారు. ఇండియా కూటమి ఆధ్వర్యంలో అనంతపురం అర్బన్ అభ్యర్థిగా సిపిఐ పార్టీ జాఫర్ కంకి కొడవలి గుర్తుకు ఓటు వేయాలన్నారు. అనంతపురం కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ అభ్యర్థి పాలమల్లి హస్తం గుర్తుకు ఓటు వేసి భారీ మెజారిటీ గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో సత్యసాయి జిల్లా కార్యదర్శి వేమయ్య, అనంత నగర కార్యదర్శి ఎన్ శ్రీరాములు,జిల్లా కార్యవర్గ సభ్యులు సి లింగమయ్య, టి నారాయణస్వామి, జి సంతోష్ కుమార్, నాగరాజు, సహాయ కార్యదర్శులు అలిపిర, రమణ, మైనారిటీ సిపిఐ నగర ప్రధాన కార్యదర్శి ఖాజ హుస్సేన్, సింగనమల నియోజకవర్గ కార్యదర్శి పి నారాయణస్వామి, రాప్తాడు నియోజకవర్గం కార్యదర్శి పి రామకృష్ణ,ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షులు రాజేష్ గౌడ్, ప్రజా సంఘాల నాయకులు, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img