Saturday, May 4, 2024
Saturday, May 4, 2024

దళిత ఎమ్మెల్యేలపై దాడి చేయడం దుర్మార్గమైన చర్య

విశాలాంధ్ర- పెనుకొండ : తెదేపా కార్యాలయం నందు మంగళవారం తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి సవితమ్మ పాత్రికేయులతో మాట్లాడుతూ,టీడీపీ ఎమ్మెల్యే డోలా వీరాంజనేయ స్వామి అరెస్టు చేయడం దుర్మార్గమైన చర్యగా భావిస్తున్నామని జగన్ రెడ్డి ప్రభుత్వం సైకో ఇజానికి నిదర్శనం, వైసిపి అవినీతి మరకలను ప్రతిపక్ష నేతలు అంటగట్టే కుట్ర జరుగుతున్నది.
ప్రతిపక్ష ఎమ్మెల్యే ఇంటి ముట్టడి అధికార పార్టీ పిలుపునివ్వడం దుర్మార్గం ,దాడికి పాల్పడిన వైసిపి నేతలను వదిలిపెట్టి టీడీపీ ఎమ్మెల్యే స్వామి ని అరెస్టు చేయడం చూస్తుంటే వైసీపీ నాయకులకి దళితుల మీద ఎంత గౌరవం ఉందో ఇట్లే అర్థమవుతుందని అదేవిదంగా ప్రకాశం జిల్లా టంగుటూరు పంచాయతీ రాయవారి పాలెం గ్రామ అంగన్వాడి కార్యకర్తగా పనిచేస్తున్న హనుమాయమ్మ ఆమె భర్త సుధాకర్ టీడీపీ సానుభూతి పరులు అనే ఉద్దేశంతో అతని భార్య అయినటువంటి హనుమాయమ్మను ట్రాక్టర్ తో తొక్కించి చంపేశారు. దళితుల మీద దాడులు ఆపకుంటే వచ్చే ఎన్నికల్లో మీకు దళితలే బుద్ధి చెబుతారని తీవ్రంగా ఖండించారు రాష్ట్ర ప్రభుత్వము దళితులు గిరిజనులు మైనార్టీలు బీసీలపై దాడులు చేస్తే సహించేది లేదని ఉధృతంగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటం చేస్తామని తెలిపారు ఈ కార్యక్రమంలో శ్రీరాములు , సూర్యనారాయణ, త్రివేంద్ర నాయుడు, చిన్న పోతన్న , పోతన్న, సుబ్రహ్మణ్యం, వాసుదేవరెడ్డి, బుసప్ప వీరచిన్న, ఆదినారాయణ, సోము,ముత్యాలప్ప తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img