Friday, April 26, 2024
Friday, April 26, 2024

కసాయి తండ్రికి మూడేళ్ల జైలు శిక్ష

విశాలాంధ్ర – కళ్యాణదుర్గం : మండల పరిధిలోని బోయలపల్లి గ్రామంలో 2020లో జరిగిన ఇద్దరు చిన్నారుల దారుణ హత్య సంఘటనలో నిందితుడైన కసాయి తండ్రికి మూడేళ్ల కఠిన కారాగార శిక్ష విధిస్తూ అనంతపురం జిల్లా జడ్జి జి. శ్రీనివాస్ తీర్పు వెలువరించారు . గురువారం అనంతపురం జిల్లా కేంద్రంలోని కోర్టు లో తుది తీర్పు వెల్లడిస్తూ నిందితుడు చిన్నారుల కన్న తండ్రి చాకలి రవికుమార్ కు శిక్ష విధించారు. కేసు పూర్వాపరాలను కళ్యాణదుర్గం ఎస్ఐ సుధాకర్ మీడియాకు తెలిపారు. బోయలపల్లి గ్రామానికి చెందిన చాకలి రవికుమార్ కు రాయదుర్గం మండలం బొమ్మక్కపల్లి కి చెందిన రాధమ్మ తో వివాహం జరిగింది. రవికుమార్ పుట్టుకతో మూగ కావడంతో తనకు పుట్టిన ఇద్దరు పిల్లలూ నా పోలికలు లేవని భార్యపై అనుమానంతో వేధించేవాడన్నారు. 2020 సెప్టెంబర్ 14న తన ఇద్దరు పిల్లలని తీసుకెళ్లి బోయలపల్లి సమీపంలోని అటవీ ప్రాంతంలో గొంతు కోసి చంపేసి పూడ్చి పెట్టాడు. ఈ విషయమై భార్య రాధమ్మ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేశారు . దీంతో నిందితుడు రవికుమార్ తాను చేసిన నేరాన్ని ఒప్పుకోవడంతో వాదనలు జరిగాయి. తుది తీర్పు గురువారం వెల్లడిస్తూ తన కన్న పిల్లలను కసాయిగా మారిన తండ్రి రవికుమార్ చంపడం దారుణమని ఇలాంటి వారికి జైలు శిక్ష శరన్యమని జడ్జి తన తీర్పులో వెల్లడించినట్లు పోలీసులు తెలిపారు.

మీడియాకు సమాచారం వెల్లడిస్తున్న కళ్యాణదుర్గం రూరల్ ఎస్ఐ సుధాకర్

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img