విశాలాంధ్ర – అనంతపురం వైద్యం : ఆంధ్ర ప్రదేశ్ కేంద్రీయ విశ్వవిద్యాలయం యొక్క ప్లేస్మెంట్ సెల్, వర్సిటీ ప్రాంగణంలో ఫిబ్రవరి 8 & 9 తేదీలలో “క్యాంపస్ టు కార్పొరేట్: లైఫ్ స్కిల్స్ కొలోక్వియం” అనే అంశంపై రెండు రోజుల క్యాంపస్ రిక్రూట్మెంట్ శిక్షణా కార్యక్రమాన్ని నిర్వహించారు. విద్యాసంబంధ, వృత్తి జీవతాల మధ్య అంతరాన్ని తగ్గించడానికి మరియు క్యాంపస్ ప్లేస్మెంట్లకు వారిని సిద్ధం చేయడానికి విశ్వవిద్యాలయంలో యూ జి మరియు పి జి ప్రోగ్రామ్‌ల చివరి సంవత్సరం విద్యార్థుల కోసం ఈ కార్యక్రమం ప్రత్యేకంగా నిర్వహించబడింది. మొదటి రోజు రిసోర్స్ పర్సన్, శ్రీ లింగేశ్వర ప్రసాద్, క్యాంపస్ నుండి కార్పొరేట్ ప్రపంచానికి మారడాన్ని సులభతరం చేయడానికి సంభాషణానైపుణ్యం, జట్టుగా ఏర్పడి పని చేయడం మరియు అనుకూలత వంటి ముఖ్యమైన జీవిత నైపుణ్యాలను అభివృద్ధి చేయడంపై దృష్టి పెట్టారు.
క్యాంపస్ ప్లేస్మెంట్ రిక్రూట్మెంట్ ప్రోగ్రామ్‌లోని రెండవ రోజు సాఫ్ట్ స్కిల్స్, శరీర భాష, ముఖాముఖి శిక్షణ మరియు వయక్తిక సంసిద్ధత యొక్క ప్రాముఖ్యతను చర్చించారు. విశ్వవిద్యాలయ ఉపకులపతి, ప్రొఫెసర్ ఎస్. ఎ. కోరి, విశ్వవిద్యాలయంలోని కార్యక్రమాల ప్రాముఖ్యతపై తన అంతర్దృష్టిని వ్యక్తం చేశారు. సాఫ్ట్ స్కిల్స్ నేర్చుకోవడమే కాదు; విద్యార్థినీవిద్యార్థులు కాలక్రమేణా వాటిని ఆచరించి, ఉన్నతంగా ఎదుగుతారని కాంక్షించారు.. ప్లేస్మెంట్ సెల్ నోడల్ ఆఫీసర్ డాక్టర్ జి మాలతి మరియు మేనేజ్మెంట్ విభాగం అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ ఎంఎస్ఆర్ ఆంజనేయులు రిసోర్స్ పర్సన్‌కు సహాయ సహకారాలు అందించారు. మేనేజ్మెంట్ ఫ్యాకల్టీ పద్యాల మనోజ కృతజ్ఞతలు తెలుపుతూ కార్యక్రమాన్ని ముగించారు.