Saturday, April 27, 2024
Saturday, April 27, 2024

అర్హులైన నిరుపేదలకు ఇంటి పట్టాలు పంపిణీ చేయాలంటూ సీపీఐ ఆధ్వర్యంలో ధర్నా

భూకబ్జా కు పాల్పడుతున్న వారిపై చర్యలు చేపట్టింది
ఇంటి పట్టాలు పంపిణీ చేయక పోతే ఆందోళన కార్యక్రమాలు చేపడతాం… సీపీఐ
ఎమ్మెల్యే సొంత మండలంలో సంక్షేమ పథకాలలో పూర్తీగా విఫలం

విశాలాంధ్ర-నల్లమాడ, మండలంలోని అర్హులైన నిరుపేదలను గుర్తించి ఇంటి పట్టాలు పంపిణీ చేయాలని శనివారం స్థానిక తహశీల్దార్ కార్యాలయం ఎదుట సీపీఐ మండల కార్యదర్శి కుంచపు చంద్ర ఆధ్వర్యంలో ధర్నా కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పుట్టపర్తి నియోజకవర్గ కార్యదర్శి అంజి, సత్యసాయి జిల్లా రైతు సంఘం సహాయక కార్యదర్శి పూల శ్రీనివాసులు హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నల్లమాడ మండల వ్యాప్తంగా అర్హులైన నిరుపేదలను గుర్తించి ఇంటి పట్టాలతో పాటు పక్కాగృహాలు మంజూరు చేయాలని వారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఇళ్లు,భూసాములు వైసీపీ కార్యకర్తలకు మాత్రమే ఇస్తున్నారని సమాచారం. నల్లమాడ, దొన్నికోట, గోపేపల్లి తదితర గ్రామాల్లో పేదలకు ఇంటిపట్టాలు కోసం దాదాపు గా 60ఎకరాలలో భూమి సదును చేసి జగనన్న పేరుతో పంపిణీ చేయాలని పేపర్లకు ప్రకటనలు మాత్రమే వచ్చాయన్నారు. పుట్టపర్తి ఎమ్మెల్యే భూములను కబ్జా చేసి సదును చేయించి పేదలకు పట్టాలు ఎందుకు ఇవ్వలేదని ప్రభుత్వాన్ని తప్పుపట్టారు. ప్రభుత్వం అధికారంలోకి వచ్చి దాదాపు మూడు సంవత్సరాల అవుతోందని ఇంతవరకు పట్టాలు పంపిణీ చేయలేదంటే భూకబ్జా కు పాల్పడుతున్నారని వారు ఆవేదన వ్యక్తంచేశారు. అరవాండ్లపల్లి సమీపంలో మంగ్లిగట్టువద్ద దాదాపుగా 40,50 ఎకరాల్లో ఈ మార్కెట్ యార్డు ఏర్పాటు చేయాలని గుట్టును కోట్ల రూపాయల తో చదును చేశారు ఇంతవరకు ఏమి నిర్మించలేదని విమర్శించారు. ఇప్పటికైనా అర్హులకు పట్టాలు ఇవ్వకపోతే పెద్ద ఎత్తున సీపీఐ పార్టీ ఆధ్వర్యం లో ఆందోళన కార్యక్రమాలు చేపడతామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని తహశీల్దార్ దేవేంద్రనాయక్ కు సమర్పించారు. స్పంధించిన తహశీల్దార్ రెండు మూడు రోజుల్లో ఇంటి పట్టాలు పంపిణీ చేస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో సీపీఐ సీనియర్ నాయకుడు ఆయా షాబ్ ,మండల సహాయ కార్యదర్శి వెంకటరమణ ఓడిచెరువు సీపీఐ మండల కార్యదర్శి చలపతి నాయుడు, మహిళా నాయకురాళ్లు తిరుపతమ్మ, ఆదిలక్ష్మి, లక్ష్మి, గంగులమ్మ, రాము, నాగేంద్ర తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img