Tuesday, April 23, 2024
Tuesday, April 23, 2024

పిల్లలకు నాణ్యమైన పోషకాహారం పంపిణీ చేయండి

విశాలాంధ్ర-రాప్తాడు : పిల్లలకు నాణ్యమైన పోషకాహారం పంపిణీ చేయాలని జాతీయ ఆరోగ్య మిషన్ ప్రోగ్రాం ఆఫీసర్ డాక్టర్ నారాయణస్వామి సూచించారు. అనంతపురం జిల్లా రాప్తాడు మండలంలోని బొమ్మేపర్తి హెల్త్ సబ్ సెంటర్, ప్రభుత్వ పాఠశాల, లింగనపల్లిలోని ప్రాథమిక పాఠశాలను ఆయన శనివారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ముందుగా సబ్ సెంటర్ లో మన రికార్డులను పరిశీలించి పలు రకాలుగా అందించే వైద్య సేవలపై ఎంఎల్హెచ్పీ మీనా ను అడిగి తెలుసుకున్నారు. తర్వాత రెండు పాఠశాలలను పరిశీలించి పిల్లలకు సరఫరా చేసే భోజనం, మెనూ అమలు తీరు తెన్నులపై ఆరా తీశారు. ముఖ్యంగా పిల్లల్లో పోషకాహార లోపం లేకుండా అవగాహన కల్పించి, మెనూ ప్రకారం భోజనం అందించాలన్నారు. అసంక్రమిత వ్యాధులపై దృష్టి సారించాలన్నారు. దీర్ఘకాలిక జబ్బులు, మధుమేహం, అధిక రక్తపోటు, థైరాయిడ్, క్యాన్సర్ గుండె, కిడ్నీ సంబంధిత జబ్బులు ఉన్నవారికి తగిన పరీక్షలు, వైద్యం చేసి నెలకు సరిపడా మందులు అందించాలన్నారు. కార్యక్రమంలో హెల్త్ అసిస్టెంట్ కంబగిరి, ఆశా వర్కర్ అరుణ, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img