Thursday, April 25, 2024
Thursday, April 25, 2024

విద్యార్థులకు క్రీడాదుస్తులు పంపిణీ

విశాలాంధ్ర-రాప్తాడు : విద్యార్థులు చదువుతోపాటు క్రీడల్లో రాణిస్తే ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని సర్పంచ్ సాకే తిరుపాలు సూచించారు. స్వర్గీయ బుల్లె కోళ్ళ నారాయణ జ్ఞాపకార్థం ఆయన కుమారుడు గేట్ సత్తి ఆధ్వర్యంలో సోమవారం రాప్తాడు ఏపీ మోడల్ స్కూల్ విద్యార్థులకు సర్పంచ్ సాకే తిరుపాలు చేతుల మీదుగా పంపిణీ చేశారు. బాలల దినోత్సవం సందర్భంగా జవహర్ లాల్ నెహ్రూ జయంతి జయంతిని పురస్కరించుకుని రూ.10వేలు విలువ చేసే క్రీడాదుస్తులు విద్యార్థులకు ఇచ్చామన్నారు. అనంతరం గేట్ సత్తిని సన్మానించారు. కార్యక్రమంలో ప్రిన్సిపల్ పద్మజాదేవి పిఈటి మల్లికార్జున వార్డ్ మెంబర్ సాకే నరేంద్ర తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img