Tuesday, March 28, 2023
Tuesday, March 28, 2023

సీఎం జగన్ ను కలిసిన ఆరోగ్యశ్రీ స్పెషల్ ఆఫీసర్ డా. యాదాల అశోక్ బాబు

విశాలాంధ్ర – నాగులుప్పలపాడు:- ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డిని ఆరోగ్యశ్రీ స్పెషల్ ఆఫీసర్ డాక్టర్ యాదాల అశోక్ బాబు సోమవారం సీఎం క్యాంప్ కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఫ్యామిలీ ఫిజీషియన్ కాన్సెప్ట్ పై జరిగిన సమీక్ష నిర్వహించారు. ఆ సమీక్ష లో సీఎం జగన్ తో పాటు డాక్టర్ యాదాల అశోక్ బాబు పాల్గొన్నారు. సమీక్ష ముగిసిన అనంతరం సీఎంను కలిసి ఆరోగ్యశ్రీపై పలు అంశాలు చర్చించుకున్నారు. ఆరోగ్యశ్రీ ద్వారా పేద ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందిస్తూ ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటున్న స్పెషల్ ఆఫీసర్ యాదాల అశోక్ బాబు ను సీఎం జగన్ అభినందించారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img