Friday, April 26, 2024
Friday, April 26, 2024

ప్రపంచంలో అన్నిటికన్నా విలువైనది అమ్మ ప్రేమ

.
ఆర్డిఓ తిప్పే నాయక్

విశాలాంధ్ర – ధర్మవరం : ప్రపంచంలో అన్నిటికన్నా విలువైనది, అమూల్యమైనది, అనంతమైనది అమ్మ ప్రేమ మాత్రమేనని ఆర్డిఓ తిప్పే నాయక్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆదివారం మాతృ దినోత్సవ సందర్భంగా పలు విషయాలను వారు తెలియజేశారు. అనంతరం వారు మాట్లాడుతూ ఒత్తిడికి లోనైనా మనసుకు, భారమైన హృదయానికి, ఉపశమనం తల్లి ఒడి మాత్రమేనని ఇది స్వర్గము కంటే గొప్పదని వారు తెలిపారు. కమ్మనైన అమ్మ ప్రేమను కుటుంబ సభ్యులందరికీ పంచుతుందని, ఇందులో విభేదాలు పిల్లల విషయంలో ఉండవని స్పష్టం చేశారు. సృష్టికి మూలం అమ్మ, అమ్మ లేకపోతే జననం, గమనం లేదు, అసలు సృష్టి లేదు అని తెలిపారు. ప్రాణం పోసేది దైవమైతే, ఆ ప్రాణాన్ని మోసేది అమ్మ మాత్రమేనని తెలిపారు. నీ చుట్టూ ఎన్ని బంధాలు ఉన్నా, అమ్మ అనే బంధం అతి ముఖ్యమైనదని వారు తెలిపారు. ప్రపంచంలో నేటికీ అమ్మస్థానం గొప్పదని, కీలక పాత్ర వహిస్తోందని తెలిపారు. తల్లి బిడ్డలతో పాటు అల్లుళ్లను కూడా చక్కటి ప్రేమతో చూడటం ఒక తల్లికి సాధ్యమవుతుందని తెలిపారు. కుటుంబంలో గానీ బంధువుల వద్ద గాని అవమానాలను సహిస్తూ, నిరంతరం సుఖ సంతోషాల కొరకు పోరాడునది ఒక్క అమ్మ మాత్రమేనని తెలిపారు. అందుకే ఈ ప్రపంచంలో అమ్మ కీలకపాత్ర పోషించడం అనేది వాస్తవమని తెలిపారు. నేటి సమాజంలో తల్లిదండ్రులను అనాధాశ్రమంలో చేర్పించుట అది సరైన పద్ధతి కాదని, ఎంత కష్టమైనా సరే కుమారులు, కూతుర్ల వద్ద ఉంటేనే తల్లిదండ్రులకు సంతోషము, చక్కటి మనశాంతి లభిస్తుందన్నారు. తల్లిదండ్రులు తమ ఆస్తిని కుటుంబములోని బిడ్డలందరికీ పంచినప్పుడు, జీవితకాలం వారిని చూసుకోవలసిన బాధ్యత కుటుంబంలోని బిడ్డలదేనని తెలిపారు. తల్లిదండ్రులు దైవంతో సమానమని, అటువంటి వారిపైన దాడులు, హింసలు చేయడం దారుణమన్నారు. అలాంటి వారిని చట్టం ప్రకారం శిక్షించాల్సిన బాధ్యత అందరి మీద ఉందని తెలిపారు. ఏది ఏమైనా తల్లిదండ్రుల ఆశీస్సులు ఉన్నప్పుడే, కుటుంబంలోని బిడ్డలు సుఖశాంతులతో మెలుగుతారన్నది నేడు వేదాలు, భగవద్గీత, రామాయణం తెలుపుతున్నాయని, ఇది అక్షర సత్యమని బిడ్డలు గ్రహించాలని తెలిపారు.-

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img