Monday, March 27, 2023
Monday, March 27, 2023

అధికంగా పెంచిన గ్యాస్ ధరలను తగ్గించాలి

సిపిఐ మండల కార్యదర్శి పి.రాము రాయల్

విశాలాంధ్ర-గుంతకల్లు : గ్రామీణ ప్రాంతాల్లో రైతులు వ్యవసాయ కార్మికులు ఇబ్బందులు పడకూడదనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం వంటగ్యాసును వినియోగించాలని ఆదేశించింది అయితే అదే గ్యాస్ ను అధిక ధరలు పెంచి రైతుల నడ్డి విరిచేందుకు రాష్ట్ర ప్రభుత్వం అవలంబిస్తున్న విధానాన్ని వ్యతిరేకిస్తూ సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో శుక్రవారం తాహసిల్దార్ కార్యాలయం వద్ద సిపిఐ నాయకులు నిరసన చేపట్టారు. ఈ నిరసన కార్యక్రమానికి సిపిఐ మండల సహాయ కార్యదర్శి రామాంజనేయులు అధ్యక్షత వహించారు.ఈ సందర్భంగా ముఖ్యఅథితులు సిపిఐ మండల కార్యదర్శి రాము రాయల్ గ్యాస్ ధరలు తగ్గించాలని తాహసిల్దార్ బి.రాముకి వినతి పత్రాన్ని సమర్పించారు.ఈ సందర్భంగా రాము మాట్లాడుతూ రాష్ట్రంలో రైతుల సంక్షేమం కోసం ప్రభుత్వం పాటుపడాలి అయితే రైతుల నడ్డి విరిచేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్న విధానాలను వ్యతిరేకిస్తూ గ్యాస్ ధరలను తక్షణమే డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు మురళీకృష్ణ, దోసలోడికి శాఖ కార్యదర్శి భాస్కర్, సిపిఐ నాయకులు నాగేంధ్ర, గురు స్వామి, సూరిబాబు,సయ్యాద్ బాషా తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img