Wednesday, May 8, 2024
Wednesday, May 8, 2024

వైయస్ఆర్సీపీ ఎమ్మెల్సీ అభ్యర్థులను గెలిపించుకుందాం

విశాలాంధ్ర – పెనుకొండ : పెనుకొండ నగర పంచాయతీ పరిధిలోని గోల్డెన్ ఎంపైర్స్ కల్యాణ మండపం నందు నియోజకవర్గానికి సంబంధించిన ఐదు మండలాల వైఎస్సార్ సీపీ నాయకులకు కార్యకర్తలకు సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు ఈ సమీక్ష సమావేశంలో రాబోయే పట్టభద్రుల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అభ్యర్థులను గెలిపించుకోవడానికి ఓటర్లను ఆకర్షించుకోవడానికి పార్టీ తీసుకుంటున్న చర్యలు మరియు పార్టీ అనుసరిస్తున్న పద్ధతుల గురించి ఎమ్మెల్యే శంకర్నారాయణ సత్యసాయి జిల్లా ఎమ్మెల్సీ ఎన్నికల ఇన్చార్జ్ శివరాం రెడ్డి జిల్లా పరిషత్ చైర్మన్ గిరిజమ్మ హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్ ఎమ్మెల్సీ మంగమ్మ పెనుకొండ పార్టీ పరిశీలకుడు బాబుల్ రెడ్డి తదితరులు పాల్గొని కార్యకర్తలకు నాయకులకు దిశనిర్దేశాన్ని చేశారు పార్టీ చేస్తున్న చేసిన పనుల గురించి వివరిస్తూ ఓట్లను అభ్యర్థించాలని అలాగే తెలుగుదేశం పార్టీ లేనిపోని దుష్ప్రచారం చేస్తున్నదని నిరుద్యోగులకు ఉద్యోగుల కల్పనలు వైఎస్ జగన్మోహన్ రెడ్డి సచివాలయ వ్యవస్థను వాలంటరీ వ్యవస్థను పోలీస్ ఉద్యోగాలను మరియు ఆరోగ్య శాఖలో ఉద్యోగాల భర్తీ చేసి రాష్ట్రస్థాయిలో రికార్డు స్థాయిలో భర్తీ చేశారని ఉపాధ్యాయులకు నాడు నేడు పథకం ద్వారా స్కూళ్లను ఆధునికరించడం పిల్లలకు లాప్టాప్ లు ఇతర సౌకర్యాలు కల్పించడం ద్వారా ఉపాధ్యాయులు తలెత్తుకునే విధంగా పనులు జరుగుతున్నాయి కావున అందరూ వైఎస్ఆర్సిపి ప్రభుత్వాన్ని ఆదరిస్తున్నందున కడప మంటతో తెలుగుదేశం పార్టీ దుష్ప్రచారం చేస్తున్నారని బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలకు వైయస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో అధిక ప్రాధాన్యత కల్పించారని కావున పార్టీ నిర్ణయించిన పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి వెన్నపూస రవీంద్రారెడ్డిని అత్యధిక మెజార్టీతో గెలిపించుకోవాల్సిన బాధ్యత ఉన్నదని గ్రామస్థాయిలో ఎంతమంది పట్టభద్రులు ఉన్నారు ఎంతమంది ఓటు నమోదు చేసుకున్నారు వారు ఎక్కడెక్కడ నివసిస్తున్నారు 13వ తేదీ వారి మీద నిఘా ఉంచి ఓటు వేయించుకోవలసిన బాధ్యత గ్రామస్థాయి లీడర్ల మీద ఉందని దిశా నిర్దేశాన్ని చేశారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img