Friday, April 26, 2024
Friday, April 26, 2024

దివ్యాంగునికి ఆర్థిక సహాయం

విశాలాంధ్ర-తాడిపత్రి: పట్టణంలోని సిపిఐ కాలనీ 12వ వార్డులో మంగళవారం సిపిఐ కౌన్సిలర్ అరుణా భర్త గంగరాజు దివ్యాంగునికి నగదు 10వేల రూపాయల ఆర్థిక సహాయం అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ సిపిఐ కాలనీలో నివసిస్తున్న దివ్యాంగుడైన భాస్కర్ అనే వ్యక్తి గృహము ప్రమాదవశాత్తు షార్ట్ సర్కూటై గృహంలో ఉన్న విలువైన సామాన్లు, గృహానికి ఉన్న ఎలక్ట్రిక్ వైరంతా కాలిపోయి తీవ్రంగా నష్టపోయాడు. ఈ సమాచారం తమకు తెలిసిన వెంటనే తాము అతని గృహానికి వైరింగ్ అంతా చేపించి, పదివేల రూపాయలు నగదు అందజేశామన్నారు. ఈ సందర్భంగా దివ్యాంగుడు మాట్లాడుతూ తన పేద తనని, అవిటితనాన్ని చూసి తనకు ఆర్థిక సహాయం చేసిన కౌన్సిలర్ అరుణా భర్త గంగరాజుకు ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఈ కార్యక్రమంలో సిపిఐ నాయకులు, కాలనీ ప్రజలు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img