Saturday, April 20, 2024
Saturday, April 20, 2024

ఆర్.డి.టి సమ్మిళిత ప్రాధమిక పాఠశాల విద్యార్థులకు ఉచిత కంటి పరీక్షలు

విశాలాంధ్ర – అనంతపురం వైద్యం : ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాఖ మరియు ఎల్వి ప్రసాద్ ఐ ఇన్స్టిట్యూట్ సంయుక్తంగా రాష్ట్ర వ్యాప్తంగా” బాల బాలికల సంరక్షణ కేంద్రాలలో” ఉచితంగా కంటి పరీక్షలు నిర్వహించి అవసరమైన వారికిఅద్దాలు,ఆపరేషన్లు చేయడం జరుగుతుంది అని ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ జిల్లా కార్యదర్శి జి .మోహనకృష్ణ పేర్కొన్నారు. మంగళవారం ఆర్.డి.టి సమ్మిళిత ప్రాథమిక పాఠశాల కుడేరు లో ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ అనంతపురం జిల్లా శాఖ, ఎల్వి ప్రసాద్ ఐ ఇన్స్టిట్యూట్ సౌజన్యంతో పిల్లలకు కంటి పరీక్షలు నిర్వహించారు. ఈ శిబిరంలో మొత్తం 123 మందికి కంటి పరీక్షలు చేయగా 12 మంది కి అద్దాలు అవసరం అని 05 మంది ని ఇన్ఫెక్షన్ మరియు కంటి పరీక్షల నిమిత్తం హయ్యర్ సెంటర్ కు రేపర్ చేయడం జరుగుతుందని 106 మంది నార్మల్ గా ఉన్నారని తెలియచేసారు. ఈ కార్యక్రమంలో ఎల్ .వి. ప్రసాద్ ఐ ఇన్సట్యూట్ కోర్డినేటర్
ఎండి. రఫిక్, ఆర్ డి టి సెంటర్ ఇంఛార్జిలు సిస్టర్ లిస్సి,సిస్టర్ రోస్లెన్ రెడ్ క్రాస్ కోఆర్డినేటర్ బి.రమేష్,టెక్నీషియన్ కృష్ణ, ఆర్ డి టి పాఠశాలసిబ్బంది, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img