Saturday, April 27, 2024
Saturday, April 27, 2024

విద్యార్థుల కు మెరుగైన విద్య ను అందజేస్తాం.. ప్రిన్సిపాల్ పద్మశ్రీ.

విశాలాంధ్ర -ధర్మవరం : పట్టణంలోని ఏపీ మోడల్ హై స్కూల్ అండ్ జూనియర్ కళాశాల విద్యార్థులకు మెరుగైన విద్యను అందించడమే మా లక్ష్యం అని ప్రిన్సిపాల్ పద్మశ్రీ పేర్కొన్నారు. ఈ సందర్భంగా వారు బుధవారం మాట్లాడుతూ ఇటీవల పదవ తరగతి ఇంటర్మీడియట్ పరీక్షలలో మా విద్యార్థులు మంచి ప్రతిభతో అత్యధిక మార్కులను సాధించి జగనన్న ఆణిముత్యాలకు ఎంపిక కావడం జరిగిందని తెలిపారు. ఇందులో భాగంగానే పదవ తరగతిలో జే. ఆదిశంకర్ 586, ఎం. మురళీకృష్ణ 586, కె. కృష్ణ తులసి 585, బి.నందిని 583. మార్కులతో ప్రతిభ కనబరిచారని తెలిపారు. అదేవిధంగా ఇంటర్మీడియట్ పరీక్ష ఫలితాలలో ఎంఈసి గ్రూపులో ఎన్. దివ్యశ్రీ 798 మార్కులతో ప్రతిభ కనపరిచి జగనన్న ఆణిముత్యాలకు ఎంపిక కావడం జరిగిందన్నారు. ఈ ఐదు మంది విద్యార్థులను ప్రిన్సిపాల్ పద్మశ్రీ తో పాటు అధ్యాపక, ఉపాధ్యాయ, బోధనేతర సిబ్బంది, తోటి విద్యార్థులు, పాఠశాల, కళాశాల కమిటీ వారు ప్రత్యేకంగా అభినందించి శుభాకాంక్షలు తెలియజేశారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img