Tuesday, April 16, 2024
Tuesday, April 16, 2024

నకిలీ రెవెన్యూ పట్టాలపై ప్రభుత్వం సిబిసిఐడితో విచారణ చేయించాలి

తెలుగుదేశం పార్టీ నాయకులు

విశాలాంధ్ర -ధర్మవరం:: శ్రీ సత్య సాయి జిల్లా ధర్మవరం పట్టణంలో నకిలీ రెవెన్యూ ఇంటి పట్టాలపై ప్రభుత్వంతో సీబీసీఐడీతో దర్యాప్తు చేయించాలని టిడిపి నాయకులు పురుషోత్తం గౌడ్, పరిసే సుధాకర్,భీమనేని ప్రసాద్ నాయుడు,పని కుమార్, బోయ రవిచంద్ర, మారుతి స్వామి లు పేర్కొన్నారు. ఈ సందర్భంగా బుధవారం తాసిల్దార్ నీలకంఠారెడ్డికి నకిలీ రెవెన్యూ పట్టాలపై గల వివరాలను వినతి పత్రంగా అందజేశారు. అనంతరం టిడిపి నాయకులు మాట్లాడుతూ గతంలో పనిచేసిన కొంతమంది అధికారుల నిర్వాహకంతో పెద్ద ఎత్తున బ్రోకర్లు నకిలీ పట్టాలు సృష్టించిడం జరిగిందన్నారు. పట్టణములోని ఎల్సికేపురం సర్వేనెంబర్ 626లో అక్రమ కట్టడాలపై గత కొద్ది రోజులుగా టిడిపి పార్టీ ఆందోళన కార్యక్రమాలను చేపట్టిందని, 2010 మార్చి 13న సర్వేనెంబర్ 626లో ప్లాట్ నెంబర్లు 4, 5, 6 లను పి. సురేష్, టి నాగమ్మ పి మధుసూదన్లకు రెవెన్యూ అధికారులు పట్టాలు మంజూరు చేశారని, తదుపరి ఆ ముగ్గురు కలిసి మరి కొంతమందికి 2011లో రిజిస్టర్ చేయించడం జరిగిందన్నారు. మరి ఆ స్థలం మున్సిపల్ అవసరం నిమిత్తం ఉన్నందున ఆ పట్టాలను రద్దు పరుస్తున్నట్లు 2012లో తాసిల్దారుగా విధులు నిర్వర్తిస్తున్న రామచంద్ర రెడ్డి నోటీసులు కూడా పంపి రద్దు చేయడం జరిగిందన్నారు. తదుపరి అక్కడ కట్టడాలకు తిరిగి పూనుకోగా అధికారులు అడ్డుకొని మునిసిపల్ రిజల్ట్ రిజర్వ్ స్థలాన్ని కాపాడటం జరిగిందన్నారు. తిరిగి అదే సర్వే నెంబర్లు సబ్ రిజిస్టర్ కార్యాలయంలో నీలూరి మమత పసల ప్రవల్లిక అనే మహిళలకు రిజిస్ట్రేషన్ చేయించడం జరిగిందన్నారు. ఇంత జరుగుతున్నా మునిసిపల్ అధికారులు చూసీచూడనట్లు వ్యవహరించడం పద్ధతి కాదని తెలిపారు. ఇప్పటికైనా ఆ స్థలాలను అధికారులు స్వాధీనం చేసుకోవాలని లేనియెడల టిడిపి ప్రజాసంఘాల ఆధ్వర్యంలో ప్రజా ఉద్యమానికి సిద్ధమవుతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో నాయకులు బోయ రవిచంద్ర, మారుతి స్వామి, కృష్ణాపురం జమీర్ అహ్మద్ ,భీమనేని ప్రసాద్ నాయుడు, సాహెబ్బి, అంబటి సనత్ ,రాళ్లపల్లి షరీఫ్, తోట వాసుదేవా తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img