Tuesday, December 6, 2022
Tuesday, December 6, 2022

కంబళదిన్నెకు ఎస్ఎస్ ట్యాంకు మంజూరు

విశాలాంధ్ర, పెద్దకడబూరు : మండల పరిధిలోని కంబళదిన్నె గ్రామ శివారుల్లో ఎస్ఎస్ ట్యాంకు నిర్మాణం చేపట్టేందుకు ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి సహకారంతో జలజీవన్ మిషన్ పథకం కింద రూ . 20. 44 కోట్లు మంజూరైనట్లు ఆర్ డబ్ల్యూఎస్ ఏఈ సాయికుమార్ తెలిపారు . శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి ప్రత్యేక చొరవతో కంబళదిన్నెకు సమ్మర్ స్టోరేజ్ ట్యాంకును ప్రభుత్వం జీవో నంబర్ 918 ప్రకారం మంజూరు చేసిందన్నారు . ఈ ప్రాజెక్టు ద్వారా కంబళదిన్నెతోపాటు జాలవాడి , దొడ్డిమేకల , హెచ్ మురవణి , కంబదహాల్ , కొత్త గొల్లలదొడ్డి , రాగిమాన్ దొడ్డి , మరో మూడు గ్రామాల ప్రజలకు రక్షిత మంచినీరు అందుతుందని స్పష్టం చేశారు . ఈ ప్రాజెక్టును 2024 , జూలై నాటికి పూర్తి చేస్తామని , త్వరలో దీని పనులకు సంబంధించి టెండర్ల ప్రక్రియ మొదలవుతుందని.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img