Saturday, April 20, 2024
Saturday, April 20, 2024

వైద్య విద్యార్థి కుటుంబమునకు ఆర్థిక సహాయం… రిటైర్డ్ జిల్లా అంధత్వ నివారణ అధికారి డాక్టర్ నరసింహులు

విశాలాంధ్ర -ధర్మవరం: కర్నూల్ లో నవీన్ కుమార్ అనే వైద్య విద్యార్థి ప్రధమ సంవత్సరం చదువుతూ పరీక్షల్లో ఫెయిల్ అయినందుకు గాను ధర్మవరం పట్టణంలో ఇటీవల ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సందర్భంగా శుక్రవారం రిటైర్డ్ జిల్లా అంధత్వ నివారణ అధికారి, కర్నూల్ వైద్య కళాశాల పూర్వ విద్యార్థుల సంఘం నాయకులు డాక్టర్ నరసింహులు తారకరామాపురంలోని వారి ఇంటికి వెళ్లి ఆ కుటుంబాన్ని పరామర్శిస్తూ, సంతాపం తెలుపుతూ, తనవంతుగా 10,000 రూపాయలను ఆర్థిక సహాయం అందజేశారు. అనంతరం వారు మాట్లాడుతూ క్షణికమైన ఆవేశంలో ఇటువంటి ఆత్మహత్యలు చేసుకోవడం తల్లిదండ్రులకు కడుపు కోత లాంటిదని, ఇలాంటి ఘటనలు మరోసారి ఎక్కడ కూడా జరగరాదని తెలుపుతూ తన బాధను వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ ప్రసాద్ రెడ్డి పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img