Saturday, April 20, 2024
Saturday, April 20, 2024

దానిమ్మలో యాజమాన్య పద్ధతులతో అధిక దిగుబడులు సాధ్యం

విశాలాంధ్ర – బుక్కరాయసముద్రం : యాజమాన్య పద్ధతులతో దానిమ్మలో అధిక దిగుబడులు సాధించవచ్చునని శ్రీకృష్ణదేవరాయ వ్యవసాయ కళాశాల అసోసియేట్ డీన్ డాక్టర్ రవీంద్రనాథ రెడ్డి పేర్కొన్నారు. మంగళవారం జాతీయ సేవా పథకంలో భాగంగా ఎం. బి. పల్లె లో రైతులకు స్వఛ్చ భారత్, వన మహోత్సవం, భూసార పరీక్షలు, సున్నం వేయడం వంటి అంశాలపై అవగాహన సదస్సు నిర్వహించారు. అనంతరం కళాశాల పాథాలజీ అధ్యాపకుడు డా. రామస్వామి , దానిమ్మ లోని తెగులు , వ్యాధుల యొక్క నివారణ , పంట లోని వివిధ రకాల వాటి యాజమాన్య పద్ధతులను తెలిపారు. గ్రామస్థులు ఎన్ఎస్ఎస్ వాలంటీర్లను , కళాశాల సిబ్బందిని , గ్రామ యువనేత బాలకృష్ణ , జాతీయ సేవా పథకం అధికారి హరీష, రామస్వామి, రామకృష్ణ, కొండారెడ్డి, సతీష్ నాయక్, కవిత, స్వరూప , విధ్యార్థులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img