Saturday, April 20, 2024
Saturday, April 20, 2024

భార్యపై కత్తితో దాడి చేసిన భర్త అరెస్టు

విశాలాంధ్ర – అనంతపురం వైద్యం : అనంతపురం ఆర్ట్స్ కళాశాలలో సుమంగళి (48 సం.) కామర్స్ లెక్చరర్ గా పని చేస్తోంది. శ్రీసత్యసాయి జిల్లా బుక్కపట్నంనకు చెందిన పరేశ్ తో 2004 సంవత్సరంలో ఈమెకు వివాహం జరిగింది. వీరికి సంతానం కలుగలేదు. ఈమె మీద భర్త అనుమానం పెంచుకున్నాడు. ఇదే కారణంతో తరుచూ ఈమెను భర్త పరేష్ హింసించేవాడు. ఈనేపథ్యంలో ఈరోజు ఉదయం ఆర్ట్స్ కళాశాలలో ఉన్న సుమంగళిపై పరేష్ కత్తితో దాడి చేసి హత్యాయత్నం చేశాడు. దాడిలో ఈమె తీవ్ర0గా గాయపడ్డారు . సుమంగలి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి ఇదే రోజు సాయంత్రం పరేష్ ను త్రీ టౌన్ సి.ఐ కత్తి శ్రీనివాసులు, ఎస్సై రంగడు యాదవ్ మరియు సిబ్బంది కలసి అరెస్టు చేశారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img