Friday, April 19, 2024
Friday, April 19, 2024

హెచ్ఐవి నియంత్రణలో యువత పాత్ర కీలకమైనది

డాక్టర్ అనుపమ జేమ్స్

విశాలాంధ్ర – అనంతపురం వైద్యం : ఆంధ్ర ప్రదేశ్ ఎయిడ్స్ నియంత్రణ మండలి ప్రాజెక్టు డైరెక్టరు ఆదేశాల మేరకు, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ లోని జిల్లా ఎయిడ్స్ నివారణ, నియంత్రణ విభాగం, ప్రభుత్వ ఆర్ట్స్ కాలేజి రెడ్ రిబ్బన్ క్లబ్ కో- ఆర్డినేటర్ సంయుక్త ఆధ్వర్యములో జిల్లాల్లోని డిగ్రీ కాలేజీ విద్యార్థులకు హెచ్. ఐ. వి. ఎయిడ్స్ అవగాహన కొరకు క్విజ్ పోటీలు నిర్వహించారు. ఈ పోటీలు జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ సమావేశ మందిరం లో గురువారం క్విజ్- కార్యక్రమానికి పూర్వ అనంతపురం జిల్లాలోని డిగ్రీ కాలేజీల నుండి విద్యార్థులు పాల్గొన్నారు. జిల్లా కుష్టు, ఎయిడ్స్ మరియు క్షయ నివారణాధికారి డా. అనుపమ జేమ్స్ మాట్లాడుతూ హెచ్.ఐ.వి. నియంత్రణ: లో యువత పాత్ర కీలకమని,హెచ్.ఐ.వి పై అవగాహన ఉన్న ప్రతి విద్యార్థి తోటి విద్యార్థులతో హెచ్, ఐ. వి. గురించి చర్చించాలని తెలిపారు.ఈ పోటీలకు జిల్లా వ్యాప్తంగా ఉన్న అన్ని కాలేజీల నుండి ఎంపిక చేయబడిన 32 మంది డిగ్రీ చదువుతున్న విద్యార్థులు హాజరైనారు. వారిలో ముగ్గురిని ఎంపిక చేసి ఈ నెల 21 తారీఖు నాడు రాష్ట్ర స్థాయిలో జరుగబోవు క్విజ్: పోటీలకు ఎంపిక చేయటం జరిగినది. ఎస్ ఎస్ ఈ ఐ ఎన్ డిగ్రీ కాలేజీలో చదువుతున్న డి . సాయి ప్రమిద మొదటి స్థానం కైవసం చేసుకోగా, అదే కాలేజీలో చదువుతున్న యూ . అనిల్ రెండవ స్థానంలో, 5 లిమా ఫలిత్ మూడవ స్థానాల్లో నిలిచారు. రాష్ట్ర స్థాయి అధికారుల ఆదేశాల మేరకు నేడు జరిగిన పోటీలలో మొదటి స్థానం నిలిచిన విద్యార్థికి 8 వేల రూపాయలు, రెండవ స్థానంలో నిలచిన విద్యార్థికి 5 వేల రూపాయలు. 3 వేల రూపాయలు వారి, వారి ఖాతాలకు జమ చేయటం జరుగుతుందని డా. అనుపమ జేమ్స్ తెలియచేసారు..
ఈ కార్యక్రమలో పాల్గొన్న ఆర్ట్స్ కాలేజీ జువాలజీ అధ్యాపకులు మరియు రెడ్ రిబ్బన్ క్లబ్ కో-ఆర్డినేటర్ డా. గిరిధర్ మాట్లాడుతూ జాతి భవిష్యత్ నిర్మాణంలో యువత పాత్ర కీలకమని, అలాగే హెచ్. వి. వి. నియంత్రణలో కూడా యువత ప్రభావ వంతమైన పాత్ర నిర్వహించాలని కోరారు. ఈ కార్యక్రమంలో కె ఎస్ ఎన్ డిగ్రీ కళాశాల అధ్యాపకురాలు ఎస్ ఆర్ కె నీరజ, హిందూపురం ప్రభుత్వ డిగ్రీ కళాశాల అధ్యాపకులు పోలయ్య, జిల్లా ఎయిడ్స్ నియంత్రణ విభాగం డిపియం వెంకట రత్నం, జిల్లా సూపర్ వైజర్ జి. వి. రమణ, సిబ్బంది మురళి తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img