Saturday, April 20, 2024
Saturday, April 20, 2024

ప్రభుత్వ ఉన్నత పాఠశాల నందు రాగి జావా పంపిణీ కార్యక్రమం ప్రారంభం

విశాలాంధ్ర – పెనుకొండ : నగర పంచాయతీ పరిధిలోని మంగళవారం ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన విద్యార్థులకు పోషకాహార లోపం వలన ఏర్పడుతున్న దుష్ఫలితాలను అరికట్టడానికి మధ్యాహ్న భోజన పథకంలో భాగంగా రాగి జావా కార్యక్రమాన్ని ప్రారంభించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా నగర పంచాయతీ కౌన్సిలర్ సద్దాం మండల అగ్రి చైర్మన్ కొండలరాయుడు మండ్లి సర్పంచ్ కిష్టప్ప మరియు ప్రధానోపాధ్యాయులు ఉపాధ్యాయులు పాల్గొని కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించారు విద్యార్థులలో ఉన్న పోషక లోపాలను సరిదిద్దడానికి బ్యాలెన్స్ చేయడానికి ఈ రాగి జావా ఎంతగానో ఉపయోగపడుతుందని ప్రభుత్వము ఉద్దేశించి ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న విద్యార్థిని విద్యార్థులకు వారానికి మూడు రోజులపాటు రాగిజావ మరియు చిక్కిలు అందజేస్తున్నది వారంలో ఐదు రోజులు కోడిగుడ్లు అందజేస్తున్నది అందులో భాగంగా సత్య సాయి సేవ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని ప్రభుత్వము లాంఛనంగా ప్రారంభించిన ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ప్రారంభించారు ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు చంద్రశేఖర్ సహ ప్రధానోపాధ్యాయులు వేణుగోపాలచార్యులు ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img